Ram Charan : రామ్ చరణ్ RC16 టైటిల్ అదేనా? టైటిల్ రివీల్ ఆ రోజే..? చరణ్ రోల్ ఏంటి?

తాజాగా ఈ సినిమా గురించి ఓ రెండు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Ram Charan RC 16 Title and Title Announcement Rumors Goes Viral

Ram Charan : రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. విలేజ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా కథ అని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ రెండు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : Sanjay Dutt : ఏకంగా 72 కోట్ల ఆస్తి ఫేవరేట్ హీరో పేరు మీద రాసి చనిపోయిన లేడీ ఫ్యాన్.. హీరో ఏం చేసాడో తెలుసా?

RC16 సినిమాలో రామ్‌ చరణ్ చేస్తున్న క్యారెక్టర్ ఏంటనే దానిపై ఫ్యాన్స్‌లో ఫుల్‌ ఎగ్జైట్‌మెంట్‌ ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అన్నీ కుదిరితే దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ క్రికెట్ – రెజ్లింగ్‌ రెండు ఆట‌ల నేప‌థ్యంతో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ప‌వ‌ర్ ఆఫ్‌ క్రికెట్ లేదా పవర్ క్రికెట్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ జరుగుతుందట. ఈ రెండిట్లోనే ఏదో ఒక టైటిల్ ఫైనల్ చేస్తారట. గతంలో పెద్ది అనే ఒక టైటిల్ వినిపించినా ఇప్పుడు పవర్ ఆఫ్ క్రికెట్ అనే పేరే వినిపిస్తుంది.

Also Read : Ram Charan : బాలీవుడ్ హిట్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. ఈ కాంబో అస్సలు ఊహించలే.. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి పండగే..

ఇక ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్టేట్ రాబోతుందంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న ఎనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. టైటిల్ గ్లింప్స్‌పై ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. గేమ్‌ఛేంజర్ ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో RC16 పై ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. RC16 కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఫుల్‌ హైప్ క్రియేట్ అవుతుంది. జూలైలోపు షూటింగ్ కంప్లీట్ చేసి అక్టోబర్‌ లోపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేసి ఎట్టి పరిస్థితిల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మరి అనుకున్నట్టే టైటిల్ ఇదే పెడతారా? చరణ్ పుట్టిన రోజుకి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తారా? సినిమా దసరాకు రిలీజ్ చేస్తారా చూడాలి.