Ram Charan : మెగా ప్రిన్సెస్‌తో రామ్ చరణ్ వీడియో చూశారా.. నెట్టింట వైరల్!
మెగాపవర్ స్టార్ ని మెగా ప్రిన్సెస్ తో చూసేందుకు మూడు రోజులు నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల ముందుకు చరణ్ తన బేబీతో వచ్చేశాడు.

Ram Charan Upasana With their baby girl photos and videos gone viral
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తాను తండ్రి అయ్యాను అని ఎప్పుడు చెబుతాడో అని మెగా అభిమానులంతా ఏందో ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు వారందరి ఎదురు చూపుకి మోక్షం కలిగింది. జూన్ 20 తెల్లవారుజాము 1.49 నిమిషాలకు ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మినిచ్చింది అనే వార్త మెగా కాంపౌండ్ లో సంబరాలు తెచ్చింది. ఇక చరణ్ అభిమానుల సంతోషానికి అయితే అవధులు లేవు. తమ మెగాపవర్ స్టార్ ని మెగా ప్రిన్సెస్ తో చూసేందుకు మూడు రోజులు నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
Ram Charan : పాప పుట్టాక మొదటిసారి మీడియా ముందు రామ్ చరణ్.. తన పోలికే అంటున్న చరణ్!
తాజాగా ఉపాసన అండ్ పాప హెల్త్ గా ఉండడంతో డాక్టర్లు నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మెగా ప్రిన్సెస్ ని తన చేతుల్లో ఎత్తుకొని రామ్ చరణ్ హాస్పిటల్ బయటికి వచ్చాడు. వారిద్దరి పై అభిమానులు పూల వర్షం కురిపించారు. కూతురితో కలిసి మీడియా ప్రతినిధులకు రామ్ చరణ్ ఫోటోలు ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దృశ్యం కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న చరణ్ అభిమానులు వీడియో చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Happy Moment for all Mega Fans ♥️?
God Bless #MegaPrincess ?✨♥️
Happy for you @AlwaysRamCharan ? pic.twitter.com/eBeH4Io4sd
— Ujjwal Reddy (@HumanTsunaME) June 23, 2023
ఇక తండ్రి అయ్యాక మొదటిసారి మీడియాతో ముందుకు వచ్చిన చరణ్ మాట్లాడుతూ.. మా పాప కోసం పూజలు చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతి తండ్రి లాగానే తానూ కూడా పుట్టిన బిడ్డని చేతులోకి తీసుకున్నపుడు ఎమోషనల్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. పాపకి ఆల్రెడీ ఒక పేరు అనుకున్నట్లు, బారసాల రోజు తానే ఆ పేరుని అనౌన్స్ చేస్తాను అంటూ వెల్లడించాడు. అలాగే పాపకి ఎవరి పోలికలు వచ్చాయి అని ప్రశ్నించగా.. “కచ్చితంగా నా పోలికలే వస్తాయి” అంటూ వ్యాఖ్యానించాడు.

Ram Charan Upasana With their baby girl photos and videos gone viral

Ram Charan Upasana With their baby girl photos and videos gone viral