Ram Gopal Varma : రితేష్ – జెనీలియా జంటపై ఆర్జీవీ కామెంట్..

రితేష్ - జెనీలియా జంటను చూస్తే అసూయ కలుగుతుందంటూ కామెంట్ చేశారు వర్మ..

Ram Gopal Varma : రితేష్ – జెనీలియా జంటపై ఆర్జీవీ కామెంట్..

Rgv

Updated On : August 6, 2021 / 6:14 PM IST

Ram Gopal Varma: కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీని పక్కన పెట్టేసి వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ‘బిగ్ బాస్’ ఫేమ్ ఆరియానా ఇంటర్వూతో రచ్చ రచ్చ చేశారు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తనకు నచ్చిన విషయాల గురించి రెస్పాండ్ అవుతూ ఉంటారు.

ఇప్పుడు ‘హహా హాసిని’.. అదేనండీ జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ గురించి పాజిటివ్ కామెంట్ చేశారు ఆర్జీవీ. ఆగస్టు 5న జెనీలియా బర్త్‌డే. ఈ సందర్భంగా రితేష్.. తామిద్దరం కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ వీడియో షేర్ చేస్తూ జెనీలియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)

ఈ వీడియో గురించి వర్మ స్పందిస్తూ.. రితేష్ – జెనీలియా జంటను చూస్తే అసూయ కలుగుతుందంటూ కామెంట్ చేశారు.. ‘బహుశా ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న జంట మీది మాత్రమే అనుకుంటా’ అని రీ ట్వీట్ చెయ్యడంతో పాటు జెనీలియాకు బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు వర్మ.

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలు చెయ్యట్లేదు. ఇంటి బాధ్యతలో పాటు ఇద్దరు కొడుకులతో బిజీ అయిపోయింది. రితేష్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తమ పెళ్లిలో రితేష్ 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడంటూ జెనీలియా చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. పెళ్లిలో వరుడు, వధువు కాళ్లు పట్టుకోవడం అనేది రితేష్ కుటుంబ ఆచారం. అందులో భాగంగానే రితేష్, జెనీలియా కాళ్లు పట్టుకున్నారు.