Ram Gopal Varma driver filed case on who attacked on office
RGV : టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల కథల నేపథ్యంతో ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇక కొంతమంది అయితే నిరసనకు కూడా దిగుతున్నారు. ఈక్రమంలోనే డిసెంబర్ 25న ఆర్జీవీ ఆఫీస్ వద్ద కొంతమంది వర్మ దిష్టి బొమ్మను దహనం చేస్తూ నిరసన చేశారు. తాజాగా ఈ విషయం పై ఆర్జీవీ కారు డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఆర్జీవీ దగ్గర పని చేస్తూ డ్రైవర్ తన కంప్లైంట్ లో ఇలా పేర్కొన్నాడు.
Also read : సలార్ పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదా.. ఈ వీడియో చూడండి క్లారిటీ వచ్చేస్తుంది..
“డిసెంబర్ 25 రాత్రి దాదాపు 12-15 మంది వ్యక్తులు గుంపుగా వచ్చి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ వద్ద దిష్టిబొమ్మని దహనం చేశారు. ఆ సమయంలో నేను, సెక్యూరిటీ గార్డ్స్, వర్మ గారి పర్సనల్ గాన్ మెన్, మరికొంతమంది స్టాఫ్ అక్కడే ఉన్నాము. వారంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ అనుచరులు అని పేర్కొన్నారు. ఆ మొత్తం దాడి సీసీటీవీ, సెల్ ఫోన్స్ చిత్రీకరణ అయ్యింది. దానిని మీకు సబ్మిట్ చేస్తున్నామని” పేర్కొన్నాడు.
కాగా వ్యూహం, శపథం సినిమాల కథాంశం ఏంటంటే.. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో చాలా నిజాలను బయట పెట్టబోతున్నట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.