Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సాంగ్ లాంచ్ చేసిన ఆర్జీవీ.. ఆర్జీవికి తగ్గ సాంగ్.. చూసేయండి..

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఫస్ట్ సాంగ్ ని ఆర్జీవీ లాంచ్ చేశారు.

Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సాంగ్ లాంచ్ చేసిన ఆర్జీవీ.. ఆర్జీవికి తగ్గ సాంగ్.. చూసేయండి..

Ram Gopal Varma Launched Honeymoon Express Movie First Song Launched

Honeymoon Express Song : 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్యరావు(Chaitanya Rao) ప్రస్తుత హీరోగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చైతన్య రావు, హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా తెరకెక్కుతున్న సినిమా హనీమూన్ ఎక్స్‌ప్రెస్. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బాల రాజశేఖరుని తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా నేడు ఈ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేశారు. నిజమా.. నిజమా.. ఇది కనులు కలగాలి సాధ్యమా.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని కళ్యాణి మాలిక్ సంగీతంలో సింగర్ సునీతతో కలిసి ఆయన కూడా పాడారు. ఈ పాటని సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ రిలీజ్ చేశారు. పాట మెలోడిగా ఉంటూనే రొమాంటిక్ గా కూడా ఉంది. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా ఇందులో చైతన్య, హెబ్బా మధ్య జరిగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా చూపించారు.

సాంగ్ రిలీజ్ అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలోని నిజమా సాంగ్ విన్నాను. చాలా మెలోడీగా ఉంది. చిత్రీకరణ, లొకేషన్స్ కూడా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా కథ కూడా విన్నాను. కొత్త కథతో రాబోతున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

 

Also Read : Miss Perfect Trailer Launch : లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

ఇక ఈ సినిమా దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. ఆర్జీవీ గారితో రెండు సినిమాలకు పని చేశాను. ఆర్జీవీ, ఆయన సినిమాలు మా లాంటి దర్శకులకు స్ఫూర్తి. శివ సినిమా నాకు దర్శకుడు అవ్వడానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఇవాళ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నాను. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమా. ఆర్జీవీ నా సినిమాలోని సాంగ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.

Ram Gopal Varma Launched Honeymoon Express Movie First Song Launched