Puneeth Rajkumar: ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో జీవించాలి.. పునీత్ మరణంపై వర్మ

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో యావత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో యావత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. బాలీవుడ్…కోలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు పునిత్ హఠాన్మరణంపై షాక్ కి గురైంది. తెలుగు సినీ సెలబ్రిటీలు సైతం పునీత్ తో తన అనుబంధాన్ని నెమరువేసుకొని సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే పునీత్ మరణాన్ని ఆయన కుటుంబం త్వరగా జీర్ణించుకోవాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!

కాగా, ప్రతిదానిపై కూడా తన మార్క్ విశ్లేషణ చేసే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పునీత్ రాజ్ కుమార్ మరణంపై స్పందించారు. అయితే, అందరిలా సానుభూతిగా ఆయన స్పందించలేదు. పునీత్ మరణంతో కళ్ళు తెరవాలని కోరారు. పునీత్ మరణం లాంటి షాకింగ్ ట్రాజెడీ చూసిన తర్వాతైనా మన కళ్ళు తెరవాలని కోరిన వర్మ.. ఆకస్మిక మరణంతో మనలో ఎవరైనా ఎప్పుడైనా అలాగే చనిపోవచ్చు. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో జీవించడం ఉత్తమం అని వర్మ స్పందించారు.

Puneeth Rajkumar: టాలీవుడ్‌తో స్వీట్ మెమొరీస్.. పునీత్ కోసం తారక్ పాట!

వర్మ చెప్పిన ఈ సత్యాన్ని కొందరు పాజిటివ్ గా తీసుకొంటే మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ.. వర్మ చెప్పిన దానిలో సత్యమే ఎక్కువగా ఉంది. మృత్యువు ఎప్పుడు ఎలా మనల్ని కమ్మేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ, దాని కోసం జీవితమంతా ఆరాటం, పోరాటంతోనే సాగిపోతుంది. బ్రతికి ఉన్న క్షణాన్ని ఆనందంగా జీవించడం మానేసిన మనుషులు భవిష్యత్ గురించి, జరిగిపోయిన గతం గురించి బాధ పడుతూ వృధా చేసేస్తుంటారు. ఇలాంటి సందర్భం వచ్చినపుడైనా ఇలా జీవితం గురించి గుర్తు చేయడం మంచిదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు