Puneeth Rajkumar: టాలీవుడ్‌తో స్వీట్ మెమొరీస్.. పునీత్ కోసం తారక్ పాట!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం సినీ ఇండస్ట్రీని కలచివేసింది. భరించలేని గుండెనొప్పి రావడం వల్ల ఆయన మరణించారని తెలుస్తోంది. ఆయన మరణ వార్తతో కోట్లాది మంది అభిమానులు..

Puneeth Rajkumar: టాలీవుడ్‌తో స్వీట్ మెమొరీస్.. పునీత్ కోసం తారక్ పాట!

Puneeth Rajkumar

Updated On : October 29, 2021 / 5:18 PM IST

Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం సినీ ఇండస్ట్రీని కలచివేసింది. భరించలేని గుండెనొప్పి రావడం వల్ల ఆయన మరణించారని తెలుస్తోంది. ఆయన మరణ వార్తతో కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి ఘోరం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా పునీత్ మృతితో సెలబ్రిటీలు దిగ్బ్రాంతికి గురయ్యారు. కన్నడ నటుడే అయినా పునీత్ తెలుగు ఇండస్ట్రీతో చాలా మంచి సంబంధాలు కలిగి మైంటైన్ చేస్తుండేది.

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!

తెలుగులో సక్సెస్ కొట్టిన చాలా సినిమాలను పునీత్ కన్నడలో రీమేక్ చేయగా.. పునీత్ సినిమాలకు కూడా తెలుగులో మన హీరోలు రీమేక్ చేసేవారు. పునీత్ నటించిన తొలి చిత్రం అప్పును పూరీ జగన్నాధ్ తెలుగులో ఇడియట్ గా రీమేక్ చేస్తే.. మహేష్ బాబు తెలుగులో నటించిన ఒక్కడు మూవీని పునీత్ కన్నడంలో అజయ్ గా రీమేక్ చేసారు. ఇదొక్కటే కాదు.. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఆంధ్రావాలా, రెఢీ ఇలా చాలా సినిమాలను కన్నడకు తీసుకెళ్లిన పునీత్.. కన్నడ టాప్ స్టార్స్ అందరితోను మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు.

Puneeth Rajkumar: మిస్ యూ పునీత్.. అభిమానుల కన్నీటి రోదన!

ఇక, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పునీత్ మంచి మిత్రుడుగా మెలిగేవాడు. పునీత్ రాజ్ కుమార్ తండ్రి దివంగత రాజ్‌కుమార్‌‌తో సీనియర్ ఎన్టీఆర్‌కు సత్సంబంధాలు ఉండేది. ఆ తర్వాత అదే కుటుంబాల నుండి పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ మంచి సంబంధాలు కలిగి ఉండేది. అందుకే పునీత్ రాజ్ కుమార్ కోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు. చక్రవ్యూహ సినిమాలో గెలియా గెలియా అంటూ కన్నడ నాట పునీత్ అభిమానులు ఆ పాటతో రచ్చ చేసేవారు. ఇలా తెలుగు సినిమాతో.. తెలుగు వారితో స్నేహ బంధంగా మెలిగిన పునీత్ మరణవార్త తెలుగు సీమను కలచివేస్తుంది.