Sandeep Reddy Vanga – RGV : రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా ఫైర్‌సైడ్ చాట్ సెషన్ .. గట్టిగానే ప్లాన్ చేసారుగా..

Ram Gopal Varma Sandeep Reddy Vanga fireside chat session
Sandeep Reddy Vanga – RGV : ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈయన తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు.
Also Read : Shriya Saran : కూతురితో కలిసి పొలంలో వరి నూర్పిడి చేస్తున్న శ్రియా శరణ్.. వీడియో చూసారా..
ఇక పోస్ట్ లో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఫైర్‌సైడ్ చాట్ సెషన్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబందించిన పోస్ట్ లో రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా ఇద్దరి ఫొటోలతో వారు ఎలా ఇంత పెద్ద డైరెకర్స్ అయ్యారో తెలిపారు. స్టోరీ టెల్లింగ్ లో రెబెల్లిన్, స్టోరీస్ ను బ్రేక్ చేసే వాళ్ళు మాతో సినిమాటిక్ ఎక్స్పో లో జాయిన్ అవ్వండని పేర్కొన్నారు.
View this post on Instagram
ఇక ఈ చాట్ ను నవంబర్ 16న హైదరాబాద్ లోని HICC, నోవాటెల్ లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 11: 15 నుండి 12:15 వరకు ఈ సెషన్ నిర్వహించనున్నారు. మరి ఇందులో రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ ఏం మాట్లాడతారు అన్నది చూడాలి..