Sankranthi Films : సంక్రాంతి రేసు..ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్!
టాలీవుడ్‌లో సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ (Sankranthi Films ) అవుతుంటాయ్.
TOLLYWOOD SANKRANTHI Films GIFT
Sankranthi Films : టాలీవుడ్‌లో సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయ్. ఈ సారి కూడా పెద్ద హీరోల మూవీస్‌తో పాటు ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రభాస్ రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ణప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి రిలీజ్ కాబోతున్నాయి.
ముగ్గురు బిగ్ స్టార్స్.. ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు మూడ్రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానున్నాయి. దీంతో సంక్రాంతికి సినిమా ఆడియన్స్ పండగే. అయితే సంక్రాంతి సినిమాలంటే టికెట్ రేట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ మెగా గిఫ్ట్ ఇవ్వబోతునట్టు టాక్. టికెట్ రేట్లు 100-150 మాత్రమే ఉంటాయంటున్నారు.
Akhanda 2 Collections : ‘అఖండ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య తాండవం..
గతంలో అయితే సంక్రాంతి సినిమాలకు సింగిల్ స్క్రీన్‌లో 250-300, మల్టీప్లెక్స్‌లో 500-600 రూపాయల వరకు టికెట్ రేటు ఉంటుంది. ప్రొడ్యూసర్లు ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని ఈ హైక్‌లు చేసుకుంటూ, ఆడియన్స్‌కు షాక్ ఇస్తుండేవారు. ఈసారి మాత్రం సినీ లవర్స్ సంక్రాంతి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఖాయమంటున్నారు.
టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్‌లో కేవలం 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 150 రూపాయలు మాత్రమే ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎందుకంటే, ఈ సంక్రాంతి సీజన్‌లో 5-6 మెగా మూవీలు క్లాష్ అవుతున్నాయి. ప్రేక్షకులు అన్ని సినిమాలు చూడాలని, బడ్జెట్ బర్న్ కాకుండా ఎంజాయ్ చేయాలని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఇది నిజమా లేక గాసిపా అనేది టాలీవుడ్ పెద్దలే చెప్పాలి.
Bad Girlz : బ్యాడ్ గాళ్స్ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ అనౌన్స్..
అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు 99రూపాయలకే సింగల్ స్క్రీన్ టికెట్ రేట్ పెట్టిన సందర్భాలున్నాయి. సో సంక్రాంతికి కూడా ఇలానే చేస్తే మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ అవ్వటం ఖాయమంటున్నారు.
