Bad Girlz : బ్యాడ్ గాళ్స్ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ అనౌన్స్..
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ బ్యాడ్ గాళ్స్(Bad Girlz).
Bad Girlz vachhesthunnaru release date announce
Bad Girlz : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ బ్యాడ్ గాళ్స్. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Mana Shankara Vara Prasad Garu : మెగా, వెంకీ స్టెప్పులతో పూనకాలే.!

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. ఈ మూవీ పూర్తి ఎంటర్‌టైన్ అని తెలిపారు. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమే ఈ సినిమా అని అన్నారు.
Akhanda 2 Collections : ‘అఖండ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య తాండవం..
సినిమా చాలా బాగా వచ్చిందని, అందరికి నచ్చుతుందన్నారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, అందరూ తప్పక ఆదిరిస్తారని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
