ఈ పాప ఎవరో తెలుసా?.. ఇంకెవరు మన లచ్చక్కే..
లాక్‌డౌన్ : మంచు లక్ష్మీని ఆటపట్టించిన రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్..

లాక్‌డౌన్ : మంచు లక్ష్మీని ఆటపట్టించిన రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్..
కరోనా మహమ్మారి ప్రభావంతో సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. క్వారంటైన్ టైమ్‌లో ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వీడియోల రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. ఏ టైమ్ ఎలా ఉన్నా తన పనిలో తానుండే వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ క్వారంటైన్ సమయంలో నెలకి వెయ్యి గంటలు ఉన్నట్లు అనిపిస్తోంది. సమయం అస్సలు కదలట్లేదు అని ట్వీట్ చేస్తూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనాపై రకరకాల ట్వీట్లు వదులుతున్నాడు. తాజాగా ఓ చిన్నారి, వాళ్ల అమ్మతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ చిన్నారి వాళ్ల అమ్మ ‘ఒంటికి బలమొస్తది, మిల్కు తాగుతావా?’ అని అడిగితే ఆ పాప మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తుంది.
ఈ వీడియోను రామ్‌గోపాల్ వర్మ షేర్ చేస్తూ.. ‘కరోనా వైరస్ నుంచి కాస్తా విరామం తీసుకోండి. ఈ పాప ఎవరో మీకు తెలిస్తే నాకు కాస్తా చెప్పండి’ అంటూ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక ఆర్‌జీవీ ట్వీట్ చూసి మంచు లక్ష్మీ ‘సార్ అంటూ(Sarrr) అంటూ కామెంట్ పెట్టారు. ఇక రిషీ అనే నెటిజన్ ‘సర్ర్ కాదు సార్.. ఆర్ షూడ్ బీ రోలింగ్’ అంటూ సరదాగా కామెంటు పెట్టాడు. మంచు మనోజ్ ‘ఇంకెవరు.. మన లచ్చక్క.. అమ్మో, నేను అయిపోయాను.. ఎటూ పారిపోలేము కూడా’.. అంటూ వర్మ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తున్న మరిన్ని టిక్‌టాక్ వీడియోలను నెటిజన్లు షేర్ చ్తేస్తున్నారు.
Inkyevaru mana Lachakka ❤️❤️ ammo nenu ayipoyanu… etu paripolemu kuda ? https://t.co/aCvY7SB4tP
— MM*??❤️ (@HeroManoj1) March 30, 2020
Read Also : ‘కుశలమా’! ‘నీకు కుశలమేనా’!! – వై. వి. ఎస్. చౌదరి