ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు(శుక్రవారం) విడుదల కాబోతున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా మీద వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు అనుకున్నంత అంచనాలు అందుకోకపోవడంతో.. రేపు (22-02-2019) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై బాలకృష్ణతో పాటు చిత్రబృందం ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేసుకోవాలని భావిస్తుంది.
ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన స్టైల్‌లో సినిమాపై సెటైర్లు వేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి వరుస ట్వీట్లతో వేడి పెంచుతున్న రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపిస్తున్న రానాని ఉద్దేశిస్తూ ట్వీట్ లు చేస్తున్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడులోని రానా క్యారెక్టర్ ఫోటోనూ పోస్ట్ చేసిన వర్మ ‘రానా.. నువ్వు ఒరిజినల్ కన్నా ఒరిజినల్‌గా కనిపిస్తున్నావ్’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే వర్మ చేసిన ట్వీట్ ఉద్దేశం ఏదైనా రానా మాత్రం వర్మ ట్వీట్‌ను పాజిటివ్‌గా తీసుకున్నాడు. వర్మ కామెంట్‌కు రిప్లై ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు.
Hey @RanaDaggubati ..U are KILLING IT ..U are looking more original than original??? pic.twitter.com/lyXrWQsNpC
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2019
Read Also:వైరల్ వీడియో : ఇది ఏలియన్ కాదు అమ్మాయి
Read Also:ముద్దు కోసం ఎన్ని తిప్పలో.. చితక్కొట్టిన పోలీసులు..!
Read Also:దేశముదురు వ్యాపారులు : పాక్ డౌన్ డౌన్ అంటే డిస్కౌంట్లు