Vyuham – Shapatham : ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల.. రిలీజ్ డేట్స్ ఇవే..

ఆర్జీవీ 'వ్యూహం', 'శపథం' సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యిపోయాయి. ఇక థియేటర్స్ లో వర్మ చూపించే..

Vyuham – Shapatham : ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల.. రిలీజ్ డేట్స్ ఇవే..

Ram Gopal Varma Vyuham Shapatham Movies release dates updates

Updated On : February 10, 2024 / 4:59 PM IST

Vyuham – Shapatham : ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఆల్రెడీ షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ రెండు చిత్రాలు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అయితే రెండు చిత్రాలు చుట్టూ వివాదాలు అలుముకోవడంతో.. విడుదల వాయిదా పడింది. ఇక ఈ మూవీస్ రిలీజ్ కోసం రెండు నెలలు పాటు వర్మ టీం కోర్టులో ఫైట్ చేసింది.

ఎట్టకేలకు విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. మొదటి మూవీ ‘వ్యూహం’.. ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంది. ఇక సెకండ్ పార్ట్ ‘శపథం’.. మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ రెండు చిత్రాలను నిర్మించారు. మరి విడుదలకే ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఈ చిత్రాలు.. రిలీజ్ అనంతరం ఇంకెన్ని వివాదాలకు దారితీస్తాయో చూడాలి.

Also read : Mahesh Babu – Suma Kanakala : మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?

ఇక ఈ సినిమాల కథాంశం విషయానికి వస్తే.. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్ పై జరిగిన కుట్రలు, 2009 నుంచి 2014 వరకు జగన్ జీవితంలో ఏం జరిగింది..? జగన్ సీఎం ఎలా అయ్యారు..? అనే అంశాలతో వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలతో ఏపీ రాజకీయాలకు సంబంధించిన చాలా నిజాలను బయట పెట్టబోతున్నట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

కాగా మూవీలో సీఎం జగన్ పాత్రలో ‘అజ్మల్ అమీర్’, వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి పాత్రలతో పాటు మరికొంతమంది రాజకీయ నాయకుల పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. కాగా రీసెంట్ గా రిలీజైన ‘యాత్ర 2’ కూడా జగన్ లైఫ్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జగన్ పాత్రని తమిళ హీరో జీవా పోషించారు.