Andhra King Taluka: రామ్ ఫ్యాన్స్ కి అలర్ట్.. “ఆంధ్రా కింగ్ తాలూకా” రిలీజ్ డేట్ మారింది.. ఇక పండగ చేస్కోండి..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "ఆంధ్రా కింగ్ తాలూకా"(Andhra King Taluka). "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Ram Pothineni 'Andhra King Taluka' movie release date changed
Andhra King Taluka: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “ఆంధ్రా కింగ్ తాలూకా”. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. “ఏ ఫ్యాన్ బయోపిక్” అనే ట్యాగ్ తో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ (Andhra King Taluka)సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. అంతేకాదు. రామ్ పోతినేనికి చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఇస్మార్ శంకర్ తరువాత ఆయన చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు.
Rajini-Kamal: హీరోకి కథ నచ్చలేదు.. వారం రోజులకే సద్దేశారు.. కమల్ షాకింగ్ కామెంట్స్
అందుకే, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు రామ్. ఎంతలా అంటే, ఈ సినిమా విడుదల వరకు మరో సినిమాను కూడా ఒప్పుకోలేదు. అంతలా ఈ సినిమా కోసం డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడు రామ్. కంటెంట్ కూడా చాలా కొత్త ఉండటంతో ఖచ్చితంగా రిజల్ట్ పాజిటీవ్ గా వస్తుంది అని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ 28న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. మేకర్స్ ప్రకటించిన తేదీ కంటే ఒకరోజు ముందే అంటే నవంబర్ 27న విడుదల చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇక ఈ న్యూస్ తెలిసి రామ్ పోతినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రామ్ కి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.
THANKS @filmymahesh for GIVING the content one day in advance! #AndhraKingTaluka is coming to you on #Thanksgiving #AKTonNOV27 #AndhraKingTaluka pic.twitter.com/55WgsZTvhN
— RAm POthineni (@ramsayz) November 16, 2025
