RAM Trailer : ‘సైంధవ్’ డైరెక్టర్ చేతుల మీదుగా ‘రామ్‌’ ట్రైలర్ రిలీజ్.. పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్..

‘సైంధవ్’ డైరెక్టర్ శైలేష్ కొలను చేతుల మీదుగా పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘రామ్‌’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

RAM Trailer : ‘సైంధవ్’ డైరెక్టర్ చేతుల మీదుగా ‘రామ్‌’ ట్రైలర్ రిలీజ్.. పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్..

RAM Rapid Action Mission Official Trailer released by Sailesh Kolanu

RAM Trailer : దేశభక్తి సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. తాజాగా అలాంటి కథతో ‘RAM’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. RAM అంటే ర్యాపిడ్ యాక్షన్ మిషన్. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయం తెరకెక్కించిన ఈ చిత్రంలో కొత్త నటుడు సూర్య అయ్యలసోమయజుల హీరోగా, ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ అండ్ పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ దేశ భక్తి గీతం ఒకటి పాడారు. బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఆ పాట అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ‘సైంధవ్’ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దేశ భక్తితో సాగే ఈ ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. “ఈ 60 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రజలది కాదు, అధికారులది కాదు, రాజకీయ నాయుకులది మాత్రమే. మీరు అప్పుడూ బానిసలే, ఇప్పుడూ బానిసలే, ఎప్పుడూ బానిసలే” అనే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

Also read : Hanuman : హనుమాన్ హిట్ అయితే.. ఆ ఫార్మేట్‌లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తారట.. అలాగే సీక్వెల్ కూడా..

దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి దీపికాంజలి వడ్లమాని ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా వంటి స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆశ్రిత్ అయ్యంగార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

RAM Rapid Action Mission Official Trailer released by Sailesh Kolanu