RRR : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రామం.. రాఘవం..’ అంటూ రామ్ చరణ్ పై పవర్ ఫుల్ సాంగ్
ఇప్పుడు తాజాగా రైజ్ ఆఫ్ రామ్ పేరిట రామ్ చరణ్ క్యారెక్టర్ ని చెప్పేలా ఓ పాటను విడుదల చేశారు. 'రామం.. రాఘవం..' అంటూ ఈ పాట సాగింది. ఈ లిరికల్ సాంగ్ ని కొద్ది క్షణాల క్రితమే ..........

Ram Charan (1)
RRR : దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజమౌళి సినిమా నుంచి రోజుకొక సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా నుంచి వరుసగా పాటల్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నిటికి మంచి స్పందన లభించింది. ఇటీవల ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చూపేలా ‘కొమురం భీముడో..’ అంటూ ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Anasuya : మలయాళంలో ఎంట్రీ ఇవ్వబోతున్న రంగమ్మత్త
ఇప్పుడు తాజాగా రైజ్ ఆఫ్ రామ్ పేరిట రామ్ చరణ్ క్యారెక్టర్ ని చెప్పేలా ఓ పాటను విడుదల చేశారు. ‘రామం.. రాఘవం..’ అంటూ ఈ పాట సాగింది. ఈ లిరికల్ సాంగ్ ని కొద్ది క్షణాల క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ క్యారెక్టర్ ని పవర్ ఫుల్ గా చెప్పారు. ఈ పాటను కె.శివదత్తా రాశారు. విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరణ్‌లు ఈ పాటని పాడగా ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ సింగర్స్ అంతా ఈ సాంగ్ కి కోరస్ అందించారు. అంతే కాక ఈ లిరికల్ సాంగ్ లో సింగర్స్ తో పాటు తెలుగు టాప్ సింగర్స్ అంతా పాడుతున్నట్టు చిత్రీకరించారు. పాటతో పాటు ఈ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.