ప్రధాని మోడీతో ‘రామాయణ్’ సీత దీపికా చిఖాలియా ఫొటో వైరల్ 

  • Published By: sreehari ,Published On : April 17, 2020 / 08:10 AM IST
ప్రధాని మోడీతో ‘రామాయణ్’ సీత దీపికా చిఖాలియా ఫొటో వైరల్ 

Updated On : April 17, 2020 / 8:10 AM IST

1987 సంవత్సరంలో దూరదర్శన్‌ ఛానెల్‌లో ప్రసారమైన ‘రామాయణ’ అనే ధారావాహిక ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. నాటి ‘రామాయణం’ ధారావాహికలో రాముడిగా అరుణ్‌ గోవిల్‌ నటించగా.. సీతగా దీపిక చిఖాలియా నటించింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఆనాటి రామాయణం ధారావాహికను దూరదర్శన్‌లో తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఇందులో సీతగా నటించిన దీపికా చిఖాలియా ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో దీపికాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. మోడీ మాత్రమే కాదు… దీపికా పక్కనే అప్పటి మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వాని కూడా కూర్చొని ఉన్నారు. 

అప్పట్లో రాజకీయ అనుభం లేకున్నా దీపికా చిఖాలియా ఎన్నికల్లో పోటీ చేసింది. బరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ తో 1991లో పోటీ చేసి ఎన్నికల్లో గెలిచింది. అనుకోకుండా 2014 జనరల్ ఎన్నికల్లోనూ బరోడా నియోజకవర్గం నుంచే ప్రధాని మోడీ గెలిపొందారు. వారణాసి నియోజకవర్గానికి మారకముందే మోడీ బరోడా నుంచే పోటీ చేసి గెలిపొందారు. ఒకప్పుడు మోడీ, అద్వానీతో పాటు కలిసి ఉన్న పాత ఫొటోను దీపికా చిఖాలియా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. దీపికా ఫొటోకు మరో నెటిజన్.. అటల్ బిహారీ వాజ్ పాయ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.

రామాయణ్ ధారవాహికలో రాముడిగా అరుణ్‌ గోవిల్‌, సీతగా దీపిక చిఖాలియా నటించగా, లక్ష్మణుడిగా సునీల్‌ లహ్రి, రావణాసురుడిగా అరవింద్‌ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్‌ నటించారు. ప్రస్తుతం దూరదర్శన్ (DD ఛానెల్) లో ప్రసారం అవుతున్న ఈ ధారావాహిక ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది.