Rana Daggubati : ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబినేషన్ బ్యాక్.. ఈసారి ‘రాక్షస రాజా’గా..

'నేనే రాజు నేనే మంత్రి' కాంబినేషన్ బ్యాక్. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా 'రాక్షస రాజా' అనౌన్స్.

Rana Daggubati : ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబినేషన్ బ్యాక్.. ఈసారి ‘రాక్షస రాజా’గా..

Rana Daggubati announce Rakshasa Raja with director teja

Updated On : December 14, 2023 / 10:16 AM IST

Rana Daggubati : తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్ అగర్వాల్, కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం నెగటివ్ ఎండింగ్ తో రూపొందినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా గ్రే షేడ్ రోల్ చేసి ఆడియన్స్ ని మెప్పించి.. హీరోగా తన కెరీర్ లో ఒక బెంచ్ మార్క్ మూవీలా మలుచుకున్నారు. ఇక ఈ కాంబినేషన్ సక్సెస్ అవ్వడంతో.. ఆడియన్స్ ఈ కలయికలో మరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

రానా, తేజ కూడా తమ కలయికలో మరో మూవీ ఉండబోతుందని తెలియజేశారు. ఇక నేడు రానా పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమా అప్డేట్ ని ఇచ్చారు. ‘రాక్షస రాజా’ అనే టైటిల్ తో కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రానా గుబురు గడ్డం, నుదిటికి నామాలు, నోటిలో బీడీ, చేతిలో మెషిన్ గన్ పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే మూవీ పై మంచి అంచనాలను క్రియేట్ చేశారు. అయితే ఈ చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి కొనసాగింపుగా వస్తుందా..? లేదా కొత్త కథా అనేది తెలియాల్సి ఉంది.

Also read : Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు..? పాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్..!

 

View this post on Instagram

 

A post shared by Rana Daggubati (@ranadaggubati)

అలాగే ఈ మూవీ షూటింగ్ ని ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు..? ఈ సినిమాకి పని చేయబోయే టెక్నీషియన్స్, నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక రానా నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రజినికాంత్ ‘వేటైయాన్’ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే తాను ప్రధాన పాత్రలో మైథాలజీ మూవీ ‘హిరణ్యకశ్యప’ని కూడా తెరకెక్కించబోతున్నారు. బాహుబలిలో భల్లాలదేవగా మెపించిన రానా.. హిరణ్యకశిపుడిగా ఎలా ఉంటాడో చూడడానికి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.