NTR Biopic : ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టినప్పుడు డైరెక్టర్ క్రిష్ కాదా? మరి ఎవరు?

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా చంద్రబాబు పాత్రలో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆ పాత్ర గురించి మాట్లాడారు.

NTR Biopic : ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టినప్పుడు డైరెక్టర్ క్రిష్ కాదా? మరి ఎవరు?

Rana Daggubati Reveals Interesting Facts about NTR Biopic

NTR Biopic : బాలకృష్ణ(Balakrishna) మెయిన్ లీడ్ లో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఎన్టీఆర్ – కథానాయకుడు, ఎన్టీఆర్ – మహానాయకుడు అనే సినిమాలుగా తెరకెక్కించారు. 2019లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మంచి విజయం సాధించినా, ఎన్టీఆర్ మహానాయకుడు కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish) తెరకెక్కించాడు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా కూడా చంద్రబాబు పాత్రలో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆ పాత్ర గురించి మాట్లాడారు. రానా మాట్లాడుతూ.. బాహుబలి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రకి నన్ను అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. అసలు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఆ సినిమాకి క్రిష్ కంటే ముందు డైరెక్టర్ తేజ. అతనే నన్ను సెలెక్ట్ చేసాడు. ఆల్రెడీ తేజతో(Teja) వర్క్ చేసి ఉన్నాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేసాడంటే కరెక్ట్ గానే పాత్రని ఊహించుకొని ఉంటాడు అనుకున్నాను. ఆ తర్వాత ఆ పాత్ర కోసం చంద్రబాబు గారిని కలవడం, వర్క్ షాప్ చేయడం, డైటింగ్ చేసి బాడీ తగ్గించడం చేశాను అని తెలిపారు.

Also Read : Raju Yadav Trailer : గెటప్ శ్రీను హీరోగా ‘రాజు యాదవ్’ ట్రైలర్ చూశారా? ఫేస్ లో నవ్వు అలాగే ఉండిపోతే..

దీంతో ఎన్టీఆర్ బయోపిక్ కి క్రిష్ కంటే ముందు తేజ డైరెక్టర్ అని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. మరి తేజని ఎందుకు పక్కన పెట్టారు అని ఆలోచిస్తున్నారు.