Rana – Siddharth : ఓ వైపు రానా – మరో వైపు సిద్దార్థ్.. నెట్ ఫ్లిక్స్ లో త్వరలో రెండు సిరీస్ లు..
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలో రాబోయే పలు సిరీస్ లు, సినిమాలను ప్రకటించారు. అందులో రానా నాయుడు 2 సిరీస్ ఒకటి. టెస్ట్ సిరీస్ ఒకటి.

Rana Naidu Season 2 and Siddarth Test Series Coming Soon in Netflix
Rana – Siddharth : వరల్డ్ టాప్ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఇండియాలో పాతుకుపోవడానికి గట్టిగానే ప్లాన్ చేస్తుంది. రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ థియేటర్స్ లో వచ్చిన భారీ సినిమాను కొనుగోలు చేయడమే కాక సొంత సినిమాలు సిరీస్ లు కూడా నిర్మిస్తుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలో రాబోయే పలు సిరీస్ లు, సినిమాలను ప్రకటించారు. అందులో రానా నాయుడు 2 సిరీస్ ఒకటి. టెస్ట్ సిరీస్ ఒకటి.
వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి గతంలో నెట్ ఫ్లిక్స్ కు చేసిన రానా నాయుడు సీజన్ పెద్ద హిట్ అయింది. అలాగే పలు బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందని పలు విమర్శలు ఎదుర్కొంది. అయితే రానా నాయుడు సీజన్ 2 కూడా అందని గతంలోనే ప్రకటించారు. ఇటీవలే రానా నాయుడు సీజన్ 2 టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ రెండో సీజన్‌లో రానా నాయుడికి ఎదురైన కొత్త సమస్య ఏంటి? తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు రానా నాయుడు ఏం చేశారు? గతంలో చేసిన పనుల వల్ల ఏర్పడిన కొత్త సమస్యలు ఏంటి? అని ఆసక్తికరంగా యాక్షన్ తో ఉండబోతుంది.
Also Read : Aha OTT : ఆహా ఓటీటీలో సరికొత్త రొమాంటిక్ కామెడీ క్రైమ్ సినిమా.. మలయాళం డబ్బింగ్..
రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా.. పలువురు ముఖ్య పాత్రల్లో లోగో మోటివ్ గ్లోబల్ మీడియా బ్యానర్ పై సుందర్ ఆరోన్ నిర్మాణంలో కరణ్ అన్షుమాన్, సుబర్న్ వర్మ, అభయ్ చోప్రా ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.
రానా నాయుడు సీజన్ 2 రిలీజ్ సందర్భంగా లోగో మోటివ్ గ్లోబల్ మీడియా నిర్మాత సుందర్ అరోన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రానా నాయుడు రెండో సీజన్‌ను త్వరలోనే రానుంది. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయిన వెంటనే రెండో సీజన్ పనులు మొదలుపెట్టాం. ఈ రెండో సీజన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, పెట్టిన బడ్జెట్ చూసి ఆడియెన్స్ ఫిదా అవుతారు. నెట్ ఫ్లిక్స్ సహకారంతో రెండో సీజన్‌ను మరింత అద్భుతంగా తెరకెక్కించాం. రెండో సీజన్ చూసిన తరువాత ఆడియెన్స్ ఆశ్చర్యపోతారు అని అన్నారు.
Also See : తండేల్ నుంచి దేశభక్తి సాంగ్ ‘ఆజాదీ..’ రిలీజ్.. విన్నారా?
మాధవన్, సిద్దార్థ్, నయనతార, మీరా జాస్మిన్.. లాంటి స్టార్స్ తో తెరకెక్కుతునన్ సిరీస్ టెస్ట్. ఏ వైనాట్ స్టూడియో బ్యానర్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మాణంలో ఎస్. శశికాంత్ దర్శకత్వంలో టెస్ట్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జీవితమే ఓ ఆట అనే కాన్సెప్ట్‌తో ఈ టెస్ట్ సిరీస్ రాబోతోంది. భిన్న మనస్తత్వాలు, భిన్న దారుల్ని ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లవ్, అంతులేని కలలు, లక్ష్యాలు, కోరికలు, క్రికెట్ వంటి ఎమోషన్స్ చుట్టూ ఈ సిరీస్ కథ నడుస్తుంది. నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ఈ సిరీస్‌ను అందించడం ఆనందంగా ఉందని నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ తెలిపారు.