Aha OTT : ఆహా ఓటీటీలో సరికొత్త రొమాంటిక్ కామెడీ క్రైమ్ సినిమా.. మలయాళం డబ్బింగ్..
మలయాళంలో సూపర్ హిట్ అయిన వివేకానందన్ విరలను సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వివేకానందన్ వైరల్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది.

Malayalam Dubbing Movie Vivekanandan Viral Streaming in Aha OTT Details Here
Aha OTT : రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు తీసుకొస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది తెలుగు ఓటీటీ ఆహా. వేరే భాషల్లో మంచి హిట్ అయిన సినిమాలను కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంది ఆహా. ఇప్పుడు ఆహా ఓటీటీలోకి మరో డబ్బింగ్ సినిమా వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన వివేకానందన్ విరలను సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వివేకానందన్ వైరల్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది.
మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండిస్తాడు. ఇప్పటికే దేవర, దసరా.. లాంటి పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. షైన్ టామ్ చాకో, శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన వివేకానందన్ విరలను సినిమా మలయాళంలో గత సంవత్సరం జనవరి 19న రిలీజయి హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో వివేకానందన్ వైరల్ పేరుతో ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
రేపు ఫిబ్రవరి 7 నుంచి వివేకానందన్ వైరల్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ సినిమాని కమల్ దర్శకత్వం వహించారు. వివేకానందన్ వైరల్ కథ విషయానికి వస్తే.. ఇద్దర్ని పెళ్లి చేసుకొని వాళ్లను వేధిస్తూ, మరో పక్క వేరే వాళ్ళతో తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ది చెప్పేందుకు భార్యలు చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఇది నటుడిగా షైన్ టామ్ చాకోకి 100వ సినిమా కావడం విశేషం.