Ranbir-Alia: ఒక్కటైన లవ్ బర్డ్స్.. పాపం హనీమూన్ టైమే లేదట!

వాళ్లు అనుకున్నట్టే బీటౌన్ క్యూట్ కపుల్ రణ్ బీర్ఆలియా పెళ్లయిపోయింది. కానీ జనాలు అనుకున్నట్టు మాత్రం జరగట్లేదు.

Ranbir-Alia

Ranbir-Alia: వాళ్లు అనుకున్నట్టే బీటౌన్ క్యూట్ కపుల్ రణ్ బీర్ఆలియా పెళ్లయిపోయింది. కానీ జనాలు అనుకున్నట్టు మాత్రం జరగట్లేదు. జనరల్ గా మ్యారేజ్ చేసుకున్నాక కపుల్ గోల్.. హనీమూన్ కదా. ఏదైనా రొమాంటిక్ డెస్టినేషన్ ను చేరుకుని.. అక్కడ వాళ్లు ఎంజాయ్ చేయడమే కాకుండా హాట్ హాట్ ఫోటోలు పెట్టి ఫ్యాన్స్ ను కూడా ఊరిస్తుంటారు. కానీ రణ్ లియా విషయంలో ఈ లెక్క తప్పింది. అసలీ జంట ఏమనుకుంటోంది..?

 

Alia Ranbir Wedding Celebrations

Ranbir-Alia: మిస్టరీలా అలియా పెళ్లి.. ఫ్యాన్స్‌కు పెద్ద పజిల్ ఇస్తున్న లవ్ బర్డ్స్!

రణబీర్ కపూర్ – అలియాభట్ వివాహం జరిగి ఇంకా వారం కూడా కాలేదు. మ్యారేజ్ మూడ్ నుంచి ఇంకా రిలేటివ్స్ కూడా బయటకు రాలేదు. పెళ్లి పనులతో, సెలెబ్రేషన్స్ చిందులతో అలసిన వారంతా రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు. సరే ఎవరెలా ఉన్నా అసలైన కపుల్ రణ్ లియా హనీమూన్ కి చెక్కేయాలి కదా. కానీ అలాంటి ఆలోచనే లేదన్నంటు ఈ దంపతులు అప్పుడే సినిమా పనులతో బిజగా మారి అందరికీ షాక్ ఇచ్చారు.

 

Alia Bhatt Ranbir Kapoor Wedding

Ranbir-Alia: తీరనున్న రణబీర్ తల్లి కోరిక.. కోడలి కోసం పదేళ్లుగా ఎదురు చూపులు!

ముంబైలో రిసెప్షెన్ తర్వాత కొత్త కపుల్ హానీమూన్ కి సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ జంట అందరి అంచనాల్ని.. ఆలోచనల్ని తారుమారు చేసింది. రణబీర్ కపూర్ టీసిరిస్ ఆఫీస్ లో స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యాడు. సందీప్ రెడ్డి వంగాతో కలిసి రణబీర్ సీరియస్ డిస్కషన్స్ చేస్తున్నాడు. ఈనెలలో మనాలిలో `యానిమల్` షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ మొత్తం రష్మికతో పాటూ రణ్ బీర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

 

Alia Bhatt Ranbir Kapoor Wedding

Alia-Ranbir: ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఒక్కటైన రణ్‌బీర్-ఆలియా జంట!

ఇక చేతుల పారాణి చెరిగిపోక ముందే ఆలియా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని షూటింగ్ కోసం జైసల్మేర్ వెళ్లింది. పెళ్లితంతు పూర్తవగానే రణ్ వీర్, కరణ్ జోహార్ సినిమా కోసం ఫ్లైట్ ఎక్కేసింది. ఇలా ప్రస్తుతం హానీమూన్ ని ఈ జంట లైట్ తీసుకుంది. ఫ్రీ టైమ్ చూసుకొని షెడ్యూల్ చేసుకోవాలనుకుంటోంది. దీంతో ఐదేళ్ల ప్రేమాయణంలో చాలాసార్లు ప్రయాణం చేసిన ఈ జంట.. ఇప్పుడు ప్రత్యేకంగా హనీమూన్ కోసం డేట్స్ కేటాయించే పని లేదులే అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.