Ranbir-Alia: మిస్టరీలా అలియా పెళ్లి.. ఫ్యాన్స్‌కు పెద్ద పజిల్ ఇస్తున్న లవ్ బర్డ్స్!

రణ్ బీర్-అలియా వెడ్డింగ్ పెద్ద మిస్టరీలా మారింది. ప్రతీది బయటికి రాకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి డేట్ ను కూడా సస్పెన్స్ లో పెట్టేసింది.

Ranbir-Alia: మిస్టరీలా అలియా పెళ్లి.. ఫ్యాన్స్‌కు పెద్ద పజిల్ ఇస్తున్న లవ్ బర్డ్స్!

Alia Bhatt Ranbir Kapoor Marriage

Ranbir-Alia: రణ్ బీర్-అలియా వెడ్డింగ్ పెద్ద మిస్టరీలా మారింది. ప్రతీది బయటికి రాకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి డేట్ ను కూడా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇదేదో సినిమాలా పెళ్లి ముహూర్తాన్ని కూడా పోస్ట్ పన్ చేసేస్తున్నారు. అలియా-రణ్ బీర్ ల పెళ్లి 13, 14 తేదీల్లో కాకుండా ఎప్పటికి వాయిదాపడింది.. అసలు ఏప్రిల్ లో ఈ జంట ఒక్కటవుతారా…?

Alia-Ranbir Wedding: రణబీర్‌తో అలియా పెళ్లి ఎక్కడ.. అతిధులు ఎంత మందంటే?

లవ్ బర్డ్స్ రణ్ బీర్ అలియా పెళ్లి డేట్.. వాళ్ల ఫ్యాన్స్ కు పెద్ద పజిల్ అయింది. ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఎప్పుడైనా అన్నారు.. లేదు 14 కన్ఫర్మ్ అన్నారు.. ఇప్పుడు చూస్తే ఏప్రిల్ 20కి పోస్ట్ పన్ అయింది అంటున్నారు. ప్రస్తుతం మరింత పెరిగిన కన్ఫ్యూజన్ కి కారణం అలియా భట్ కజిన్ రాహుల్. రీసెంట్ గా రణ్ బీర్ అలియా పెళ్లి గురించి నోరు విప్పిన రాహుల్.. ఎంతో సీక్రసీ మెయింటైన్ చేద్దామనుకున్నా.. 13, 14 డేట్స్ బయటికొచ్చాయి.. సెక్యూరిటీ దృష్ట్యా మెహందీ, హల్దీ, మిగిలిన కార్యక్రమాలను మార్పు చేసి.. పెళ్లిని 20కి పోస్ట్ పన్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చాడు.

Ranbir-Alia: తీరనున్న రణబీర్ తల్లి కోరిక.. కోడలి కోసం పదేళ్లుగా ఎదురు చూపులు!

మళ్లీ అంతలోనే మాట మార్చి నేనలా అనలేదు.. ఏప్రిల్ 20కి ముందు ఎప్పుడైనా అలియాకి రణ్ బీర్ మూడు ముళ్లు వేసెయొచ్చు అని చెప్పుకొచ్చాడు. బాంద్రాలోని రణ్ బీర్ కుటుంబానికి చెందిన రాయల్ హౌజ్ లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు కానీ పెళ్లి మాత్రం కొలబా తాజ్ హోటల్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి గ్రాండ్ గా రెండు రిసెప్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు.

Jr NTR-Alia: అలియా పెళ్లి.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

ఇప్పటికైతే కపూర్స్ ఇంటి దగ్గర మ్యారేజ్ పనులు మాత్రం హై రేంజ్ లో జరిగిపోతున్నాయి. హడావిడీ పీక్స్ కు చేరుకుంది. బెంగళూర్ నుంచి స్పెషల్ గా తెప్పించిన వైట్ బటన్ పూలతో వెడ్డింగ్ వెన్యూను అలంకరించబోతున్నారు. ఇక స్పెషల్ సెక్యూరిటీ కోసం 200మంది బౌన్సర్స్, ఎక్కడికక్కడ డ్రోన్స్, స్క్రీన్స్ తో వెన్యూను ఫుల్ గా టైట్ చేస్తున్నారు.