Alia-Ranbir: ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఒక్కటైన రణ్‌బీర్-ఆలియా జంట!

బాలీవుడ్ బ్యూటీఫుల్ పెయిర్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట.....

Alia-Ranbir: ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఒక్కటైన రణ్‌బీర్-ఆలియా జంట!

Ranbir Kapoor Alia Bhatt Ties The Knot

Alia-Ranbir: బాలీవుడ్ బ్యూటీఫుల్ పెయిర్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట భార్యాభర్తలుగా తమ కొత్త జీవితానికి నాంది పలికారు. గతకొద్ది రోజులుగా ఈ జంట పెళ్లి ఏర్పాట్ల గురించిన వార్తలు బాలీవుడ్ వర్గాలతో పాటు యావత్ సినీ వర్గాల్లో జోరుగా హల్‌చల్ చేస్తూ వచ్చాయి. ఏప్రిల్ 14న ఈ జంట ఒక్కటవబోతుందని తెలిసినప్పటి నుండి బీ-టౌన్ మీడియా ఈ జంట పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను కవర్ చేస్తూ వస్తోంది.

Alia-Ranbir: అలియా కల నిజమయ్యే క్షణం.. కపూర్-భట్ వారి పెళ్లిసందడి!

అయితే ఇవాళ సాయంత్రం రణ్‌బీర్, ఆలియా వివాహానికి ముహూర్తం కుదరగా.. రెండు కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ బాంద్రాలోని వాస్తు రెసిడెన్స్‌కు చేరుకున్నారు. కాగా కొద్దిసేపటి క్రితమే రణ్‌బీర్ కపూర్ ఆలియా మెడలో తాళి కట్టడంతో ఈ జంట భార్యాభర్తలుగా మారిపోయారు. చాలా కాలం నుండి బీటౌన్ లవ్‌బర్డ్స్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రణ్‌బీర్, ఆలియా బాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. కాగా వీరి వివాహానికి కపూర్ ఫ్యామిలీ, భట్ ఫ్యామిలీ సభ్యులతో పాటు పలువురు సన్నిహితులు కూడా హాజరయ్యారు.

Ranbir-Alia : మొదలైన రణబీర్, అలియా పెళ్లి పనులు.. సెల్‌ఫోన్ కెమెరాలకు కూడా నో ఎంట్రీ..

పంజాబీ ఆచారం ప్రకారం రణ్‌బీర్ – ఆలియాల వివాహం నిర్వహించారు కుటుంబ సభ్యులు. వీరి వివాహం అయిపోగానే, బయట ఉన్న మీడియా వారికి, అభిమానులకు వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచినట్లుగా తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో రణ్‌బీర్, ఆలియా కుటుంబాలకు చెందిన 50 మంది సభ్యులు మాత్రమే హాజరైనట్లు బీటౌన్ మీడియా పేర్కొంది. ఇక ఎట్టకేలకు ఒక ఇంటివారైన ఆలియా-రణ్‌బీర్ కపూర్‌లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు వారి ఫ్రెండ్స్, సన్నిహితుల నుండి ఈ జంటకు ఆల్ ది బెస్ట్ విషెస్ అందుతున్నాయి.