Ranbir-Alia : మొదలైన రణబీర్, అలియా పెళ్లి పనులు.. సెల్‌ఫోన్ కెమెరాలకు కూడా నో ఎంట్రీ..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, స్టార్ హీరోయిన్ అలియా భట్‌ త్వరలో పెళ్లి బంధంతో ముడిపడనున్నారు. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే........

Ranbir-Alia : మొదలైన రణబీర్, అలియా పెళ్లి పనులు.. సెల్‌ఫోన్ కెమెరాలకు కూడా నో ఎంట్రీ..

Ranbir

 

Ranbir-Alia :  ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్ళిళ్ళని చాలా సీక్రెట్ గా చేసుకుంటున్నారు. అతి తక్కువ మంది సమక్షంలోనే వివాహ వేడుకలు చేసుకుంటున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ కపుల్ ఒక్కటవ్వబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, స్టార్ హీరోయిన్ అలియా భట్‌ త్వరలో పెళ్లి బంధంతో ముడిపడనున్నారు. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఏప్రిల్ 14 అంటే రేపు ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. ముంబైలోని పాలీ హిల్స్‌లో ఉన్న వాస్తు రెసిడెన్సీలో ఉదయం నుంచి పలు వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం గణేశ్‌ పూజ జరగగా, మధ్యాహ్నం నుంచి మెహిందీ ఫంక్షన్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ వేడుకల్ని చాలా గోప్యంగా నిర్వహిస్తున్నారు. కేవ‌లం ర‌ణ్‌బీర్‌, ఆలియా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ వేడుకలు జరుగుతున్నాయి.

Vijay : బీస్ట్ సినిమా నచ్చలేదని థియేటర్‌కి నిప్పు పెట్టిన ఫ్యాన్స్

దీంతో వాస్తు బిల్డింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవర్ని లోపలి రానివ్వడంలేదు. కేవలం ప్రత్యేక ఆహ్వానం ఉన్నవారినే లోపలి పంపిస్తున్నారు. మీడియాకి అస్సలు అనుమతి లేదు. లోపలికి వచ్చేవారిని కూడా ఆపి వారి ఫోన్స్ కి ఫ్రంట్, బ్యాక్ ఉన్న కెమెరాలకు రెడ్ కలర్ స్టికర్ వేస్తున్నారు. ఆ బిల్డింగ్ బయటే ఉన్న మీడియా దీన్ని వీడియో తీయగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోపల జరిగే వేడుకలు ఫోటోలు,వీడియోల రూపంలో బయటకి రాకూడదని ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అభిమానులు వీరి వివాహ వేడుకల ఫోటోల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ వీరి వివాహం ఎక్కడ జరగనుందో, ఎలా జరగనుందో లాంటి సమాచారాన్ని కూడా బయటకి రానివ్వలేదు ఈ స్టార్ కపుల్.