Ranbir Kapoor : ఆ సినిమా నా గడ్డం వల్లే హిట్ అవ్వలేదు..

  బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చాలా గ్యాప్ తీసుకొని షంషేరా, బ్రహ్మాస్త్ర సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకులని పలకరించాడు. బ్రహ్మాస్త్ర పర్వాలేదనిపించినా షంషేరా మాత్రం ఘోర పరాజయం చూసింది. నష్టం కూడా భారీగానే వచ్చింది. రణబీర్ కపూర్.............

Ranbir Kapoor : ఆ సినిమా నా గడ్డం వల్లే హిట్ అవ్వలేదు..

Ranbir Kapoor comments on Shamshera movie Flop

Updated On : December 9, 2022 / 12:53 PM IST

Ranbir Kapoor :  బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చాలా గ్యాప్ తీసుకొని షంషేరా, బ్రహ్మాస్త్ర సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకులని పలకరించాడు. బ్రహ్మాస్త్ర పర్వాలేదనిపించినా షంషేరా మాత్రం ఘోర పరాజయం చూసింది. నష్టం కూడా భారీగానే వచ్చింది. రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ లో, వాణి కపూర్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్ దత్ ముఖ్యపాత్రలో స్వాతంత్ర్యానికి ముందు సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే బాక్సాఫీస్ వద్ద షంషేరా సినిమా పరాజయం పాలైంది. తాజాగా రణబీర్ కపూర్ రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ లో రణబీర్ కపూర్ షంషేరా పరాజయానికి ఓ ఆసక్తికర కారణం చెప్పాడు.

రణబీర్ కపూర్ ఆ ఫిలిం ఫెస్టివల్ లో మాట్లాడుతూ.. నేను చేసిన అతి కష్టమైనా సినిమాల్లో షంషేరా ఒకటి. కాకపోతే ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా పరాజయానికి మేము చేసిన పొరపాట్లు కూడా కారణమే. వాటిల్లో నా గడ్డం ఒకటి. ఈ సినిమా కోసం నేను కృత్తిమ గడ్డం పెట్టుకున్నాను. ఎక్కువగా షూట్స్ ఎండలోనే జరిగాయి. ఎండలో షూట్స్ జరిగేటప్పుడు నా పెట్టుకున్న గడ్డం సరిగ్గా కనిపించలేదు, ముఖానికి అతుక్కున్నట్టు కనిపించింది. అందుకే ఈ సినిమా హిట్ అవ్వలేదు అనుకుంటా అని అన్నాడు.

Satya Dev : నాకొక పెద్ద థియేట్రికల్ హిట్ కావాలి..

అయితే గడ్డం వల్ల సినిమా హిట్ అవ్వలేదని రణబీర్ చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏదైనా షంషేరా సినిమా మాత్రం ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నాడు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.