Ranveer- Deepika: సందీప్ ను రిజెక్ట్ చేసిన రణవీర్.. భార్య కంటే ముందే.. ఇద్దరూ ఇద్దరే!

సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథను బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్(Ranveer- Deepika) నో చెప్పాడట.

Ranveer- Deepika: సందీప్ ను రిజెక్ట్ చేసిన రణవీర్.. భార్య కంటే ముందే.. ఇద్దరూ ఇద్దరే!

Ranveer Singh and Deepika Padukone rejected Sandeep Reddy Vanga offer.

Updated On : January 3, 2026 / 7:40 AM IST
  • సందీప్ ఆఫర్ రిజెక్ట్ చేసిన రణవీర్
  • భార్య దీపికా కంటే ముందే నో చెప్పాడు
  • అయన బాటలోనే దీపికా కూడా

Ranveer- Deepika: సందీప్ రెడ్డి వంగ.. ఈ పేరు ఇప్పుడొక బ్రాండ్. ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. ఆయన టేకింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. హీరోలతో సరికొత్త డైమెన్షన్లో సినిమాలు చేయడం సందీప్ స్టైల్. ఇప్పుడు ఈ దర్శకుడు కథ చెప్పి డేట్స్ అడిగితే నో చెప్పే స్టార్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సందీప్ తో వర్క్ చేయడానికి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నో చెప్పాడట.

ఈ విషయం గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వయంగా చెప్పుకొచ్చాడు. నిజానికి అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ రణవీర్ సింగ్(Ranveer- Deepika) తో చేయాలని సందీప్. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట రణవీర్. ఆ తరువాత ఆ రీమేక్ షాహిద్ కపూర్ కి వెళ్ళింది. అయితే, షాహిద్ కన్నా రణవీర్ సింగ్ బెటర్ అప్షన్ అని, అతను బాక్సాఫీస్ రిపోర్ట్స్ కూడా అంతగా లేవు అని చాలా మంది సందీప్ కి చెప్పారట.

The Rajasaab: ప్రభాస్ జోకర్ లుక్ అందుకే.. రాజాసాబ్ 2లో కూడా.. నోరుజారిన మారుతీ

కానీ, షాహిద్ గొప్ప నటుడని, అవకాశం వస్తే అదరగొట్టేస్తాడని తెలిసి షాహిద్ ని తీసుకున్నాడట సందీప్ రెడ్డి వంగ. అలా అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే, కేవలం రణవీర్ సింగ్ మాత్రమే కాదు, ఆయన సతీమణి దీపికా కూడా సందీప్ రెడ్డి సినిమా నుంచి తప్పుకుంది.

సందీప్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పక్కన దీపికా చేయాల్సింది. కానీ, పని వేళల్లో ఆమె కండీషన్స్ పెట్టడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో గ్లామర్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు సందీప్ రెడ్డి. ఇలా భార్యాభర్తలు ఇద్దరు సందీప్ తో సినిమా చేసే అవకాశాన్నీ మిస్ చేసుకున్నారు.