’83’ టైటిల్ పోస్టర్ విడుదల

రన్‌వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను ‘‘83’’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతుంది. కపిల్ దేవ్ జీవితం, 1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1983లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ సేన వరల్డ్ కప్‌లో అద్భుత విజయం సాధించి భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించింది.
అయితే లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి లోగోను విడుదల చేసింది చిత్రయూనిట్. కబీర్ సింగ్ దర్శకత్వంలో రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘83’ సినిమా తెరకెక్కుతోంది. మంటేన్, సాజిద్ నడియావాలా, రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10, 2020న విడుదలకానున్న ఈ సినిమాలో రన్‌వీర్ సతీమణి దీపిక కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో కపిల్‌దేవ్‌లా రణవీర్ సింగ్, సునీల్ గవాస్కర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, మహీందర్ అమర్‌నాథ్‌గా షకీబ్ సలీమ్, బల్వీందర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారి, రవిశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేకర్ శర్మ, యశ్‌పాల్ శర్మగా జతిన్ శర్నా, రోజర్ బన్నిగా నిశాంత్ దహియా, సునీల్ వాల్సన్‌గా ఆర్.బద్రి, ఫరూక్ ఇంజనీర్‌గా బోమన్ ఇరాని, పి.ఆర్.మన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠిగా నటిస్తున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న `83` సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు.