Rashi Singh : నన్ను కొట్టారు.. నెల రోజులు హౌస్ అరెస్ట్ చేసారు.. ఫేక్ ఏజ్ పెట్టి.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్..
ఈ క్రమంలో తన మోడలింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది. (Rashi Singh)
Rashi Singh
Rashi Singh : చత్తిస్త్ఘడ్ భామ రాశి సింగ్ టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి ట్రెండింగ్ లో ఉంటుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రెస్టారెంట్ బిజినెస్ కూడా మొదలుపెట్టింది ఈ భామ.
రాశి సింగ్ వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలో తన మోడలింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.
Also Read : Rashi Singh : పెళ్లి చేసుకుంటాను.. అలాంటి అబ్బాయి దొరికితే.. పెళ్లిపై రాశి సింగ్ కామెంట్స్..
రాశి సింగ్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పట్నుంచి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో తెలియకుండా మిస్ చత్తిస్త్ఘడ్ పోటీలకు అప్లై చేశాను. మినిమమ్ 18 ఏళ్ళు ఉండాలని తెలియడంతో నేను చూడటానికి అలానే కనిపిస్తాను అని ఫేక్ ఏజ్ పెట్టి అప్లై చేసి ఇంట్లో తెలియకుండా పోటీలకు వెళ్ళాను. ఆ పోటీల్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది పేపర్లో పడటంతో మా అన్నయ్య పేపర్లో నా ఫోటో చూసి ఇలా చేసినందుకు కొట్టాడు. నన్ను బాగా కొట్టి నెల రోజులు హౌస్ అరెస్ట్ చేసారు.
మా ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. నాకు ఫోన్ కూడా కట్ చేసారు. అప్పుడు చాలా బాధపడ్డాను. చదువు అయ్యాక ఎయిర్ హోస్టెస్ జాబ్ అని చెప్పి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ మోడలింగ్, సినిమా ఛాన్సులకు ట్రై చేసి ఇలా సినిమాలు చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాక మా అన్నయ్య నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. తను హోటల్ మేనేజ్మెంట్ చదవడంతో నా రెస్టారెంట్ ని తనే చూసుకుంటున్నాడు. మా అన్నయ్య కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయి ఇక్కడే సెటిల్ అయిపోయాడు అని తెలిపింది.
Also See : Venkatesh kalyan Ram : వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
