ట్రోల్స్ ఆపేయండి ప్లీజ్.. నేను కుక్క బిస్కెట్లు తినను!..
‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్‌లో కుక్క బిస్కెట్ల సీక్రెట్ గురించి చెప్పిన రష్మిక..

‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్‌లో కుక్క బిస్కెట్ల సీక్రెట్ గురించి చెప్పిన రష్మిక..
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. ‘ఛలో’ మూవీతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. గతకొద్ది రోజులుగా కుక్క బిస్కెట్ల విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి, కుక్క బిస్కెట్ల వెనకున్న కథ గురించి చెప్పుకొచ్చింది రష్మిక. “డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్‌కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. భీష్మ వెరీ క్యూట్ ఫిల్మ్..
‘‘నేను ఒక్కసారి చిన్న ముక్క (కుక్క బిస్కెట్) తిన్నా. అయితే… నితిన్ చెప్తాడనుకోలేదు. అదంత వైరల్ అవుతుందనుకోలేదు. సాధారణంగా తిండి అనే కాదు, చాలా విషయాల్లో ప్రయోగాలు చేస్తా. అయితే… డాగ్ బిస్కెట్స్ తింటాననే అంశం మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. నేను కుక్క బిస్కెట్లు తినను., ప్లీజ్.. ట్రోల్స్ ఆపేయండి!’’.. అంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది రష్మిక.
Read More>>మేకపిల్లైతే కోసుకుని తింటా.. ఆడపిల్లైతే అమ్ముకుని తింటా..