Rashmika : ఇకపై మిమ్మల్ని ప్రతి సంవత్సరం కలుస్తాను.. వర్చువల్ ఫ్యాన్స్ మీట్ ప్లాన్ చేస్తోన్న రష్మిక..

రష్మిక తన పోస్ట్ లో.. మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పాటలు మిమ్మల్ని అలరించాయని అనుకుంటున్నాను. ఇక నుంచి మీ అందరితో కలవాలనుకుంటున్నాను. వర్చువల్ మీట్ లో అయినా సరే.............

Rashmika Mandanna Planning Fan Meets Virtually

Rashmika :  నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉంది రష్మిక. త్వరలో సంక్రాంతికి వారసుడు సినిమాతో విజయ్ సరసన తెలుగు, తమిళ్ ప్రేక్షకులని పలకరించబోతుంది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలతో కూడా అలరిస్తుంది ఈ భామ. ప్రస్తుతం వారసుడు సినిమాతో పాటు బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

తాజాగా కొన్ని తన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఇటీవలే వారసుడు ఆడియో లాంచ్ చెన్నైలో గ్రాండ్ గా చేశారు. దీని గురించి ప్రస్తావించింది.

Producer Vijay : సలార్ షూటింగ్ జనవరిలో పూర్తి చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేస్తాం..

రష్మిక తన పోస్ట్ లో.. మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పాటలు మిమ్మల్ని అలరించాయని అనుకుంటున్నాను. ఇక నుంచి మీ అందరితో కలవాలనుకుంటున్నాను. వర్చువల్ మీట్ లో అయినా సరే కుదిరితే జూమ్ కాల్ లేదా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో అయినా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాను. మీతో సమయం గడపడం నాకు సంతోషాన్నిస్తుంది అని తెలిపింది. అభిమానులతో ఫ్యాన్స్ మీట్స్ ఏర్పాటు చేస్తుంది అనడంతో రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.