Site icon 10TV Telugu

Rashmika Mandanna : సెలబ్రిటీలకు గిఫ్ట్స్ పంపిస్తున్న రష్మిక.. మై డియర్ రష్ అంటూ బన్నీ పోస్ట్.. ఏం పంపిస్తుందో తెలుసా?

Rashmika Mandanna Sends Special Gifts to Celebrities Allu Arjun Reacts

Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవలే కుబేరా సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టింది. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తు దూసుకుపోతుంది. తాజాగా రష్మిక టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలందరికి స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తుంది. అల్లు అర్జున్ కి కూడా గిఫ్ట్ పంపడంతో బన్నీ తన సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ పెట్టాడు.

రష్మిక మందన్న ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ మొదలుపెట్టింది. డియర్ డైరీ అనే పేరుతో పెర్ఫ్యూమ్స్ ని సెల్ చేస్తుంది. ఇందులో నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్ని కూడా 100ml, 10ml లో దొరుకుతున్నాయి. 100ml కాస్ట్ 2599 కాగా 10ml కాస్ట్ 599 రూపాయలుగా ఉంది. ప్రస్తుతానికి ఇవి ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి.

Also Read : Amardeep : స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతాను.. సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశా.. చాలా సినిమాల్లో నా సీన్స్ ఎడిటింగ్ లో తీసేసారు..

అయితే రష్మిక తన పెర్ఫ్యూమ్ బిజినెస్ ప్రమోషన్స్ లో భాగంగా తనకు బాగా దగ్గరైన సెలబ్రిటీలకు అన్ని రకాల పర్ఫ్యూమ్స్ కలిపి ఉన్న సెట్ ని గిఫ్ట్ గా పంపిస్తుంది. ఈ గిఫ్ట్ అందుకున్న సెలబ్రిటీలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసి రష్మికకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ కి కూడా తన డియర్ డైరీ పర్ఫ్యూమ్స్ ని పంపించగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. థ్యాంక్యూ సో మచ్ మై డియర్ రష్. నీ కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. నీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను అని తెలిపాడు. బన్నీ పెట్టిన పోస్ట్ కి రష్మిక రిప్లై ఇస్తూ థ్యాంక్యూ చెప్పింది. దీంతో బన్నీ పోస్ట్ తో పాటు రష్మిక డియర్ డైరీ పెర్ఫ్యూమ్ కూడా వైరల్ అవుతుంది.

Also Read : Ticket Price Hikes : డబ్బింగ్ సినిమాలకు భారీగా టికెట్ రేట్ల పెంపు? అవసరమా అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

Exit mobile version