Ticket Price Hikes : డబ్బింగ్ సినిమాలకు భారీగా టికెట్ రేట్ల పెంపు? అవసరమా అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

ఈ రెండు సినిమాల్లో ఎంత మన తెలుగు హీరోలు ఉన్నా, వేరే హీరోలకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా ఇవి రెండూ డబ్బింగ్ సినిమాలే.

Ticket Price Hikes : డబ్బింగ్ సినిమాలకు భారీగా టికెట్ రేట్ల పెంపు? అవసరమా అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

Ticket Price Hikes

Updated On : August 12, 2025 / 9:58 AM IST

Ticket Price Hikes : ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి తమిళ్ సినిమా కూలీ. రెండు బాలీవుడ్ సినిమా వార్ 2. కూలీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఉండటం, మన కింగ్ నాగార్జున మెయిన్ విలన్ అవ్వడంతో పాటు తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, శృతి హాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉండటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వార్ 2 లో ఎన్టీఆర్ ఉండటంతో ఈ సినిమా కోసం తెలుగు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ రెండు సినిమాల్లో ఎంత మన తెలుగు హీరోలు ఉన్నా, వేరే హీరోలకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా ఇవి రెండూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటికే అనవసరంగా టికెట్ రేట్లు పెంచుతున్నారని ఫ్యాన్స్, సినిమా లవర్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు భారీగా పెంచినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కూలీ సినిమాకు పలు మాల్స్ లో భారీ టికెట్ రేట్లు చూపిస్తున్నాయి. చెన్నై కంటే ఇక్కడ హైదరాబాద్ లోనే కూలీ సినిమాకు టికెట్ రేటు ఎక్కువ ఉండటంతో విమర్శలు వస్తున్నాయి.

Also Read : NTR : ఎన్టీఆర్ మాటల వెనక ఆంతర్యం ఏమిటో? చర్చగా మారిన ఎన్టీఆర్ కామెంట్స్..

ఇక వార్ 2 సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారని వార్త వినిపిస్తుంది. నాగవంశీ ఆల్రెడీ మొన్న వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో హిందీ కంటే ఇక్కడే ఎక్కువ కలెక్షన్స్ రావాలి,ఎన్టీఆర్ అన్న పవర్ ఇండియా అంతా తెలియాలి అంటూ ఫ్యాన్స్ కి అల్టిమేటం ఇచ్చారు. దీంతో వార్ 2 కి కూడా టికెట్ రేట్లు భారీగా పెంచి కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు.

నిర్మాతలు ఫ్యాన్స్ ని దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మన తెలుగు సినిమా, భారీ బడ్జెట్ సినిమా అంటే పర్లేదు అనుకోవచ్చు కానీ కేవలం డబ్బింగ్ రైట్స్ కొని తీసుకొచ్చిన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచితే ఇంక సినిమాలకు ఎవరు వస్తారు అని ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలే థియేటర్స్ కి జనాలు రావట్లేదు అంటారు మళ్ళీ వాళ్ళే ఇలా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు నెటిజన్స్ ఈ టికెట్ రేట్లపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్ పెంపుకు సహకరిస్తున్న ప్రభుత్వాలను కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. నిర్మాతలు అడిగినంత ఎందుకు పెంచుకోమని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా టికెట్ రేట్లు పెంచారని అక్కడి తెలుగు వారు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో టికెట్ రేట్ల వివాదం సీరియస్ గానే నడస్తుంది. దీనిపై నిర్మాతలు ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Also Read : Upasana : అత్తామామల గురించి ఉపాసన ఏం చెప్పిందంటే? సురేఖ ఇచ్చిన సలహా ఇదే.. ఆ విషయంలో చిరు, ఉపాసన ఒకటే..