రష్మిక ఆవకాయ అదుర్స్ అంటున్న నమ్రత

‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హి ఈజ్ సో క్యూట్, హి ఈజ్ సో స్వీట్’ అంటూ ఏ ముహూర్తాన మహేష్ బాబుని చూసి ఫ్లాట్ అయ్యి పాటందుకుందో కానీ కన్నడ చిన్నది రష్మిక ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ మహేష్ అండ్ ఫ్యామిలీని సర్‌ప్రైజ్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుత లాక్‌డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి కూర్గ్‌లోని హిల్ స్టేషన్‌లో మాన్‌సూన్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తుంది రష్మిక.
తాజాగా అక్కడ పండే ఫ్రూట్స్‌తో పాటు తానే స్వయంగా చేసిన ఆవకాయ పచ్చడిని అందంగా ప్యాక్ చేసి మహేష్ బాబుకి గిఫ్ట్‌గా పంపింది. రష్మిక దగ్గరినుండి సర్‌ప్రైజ్ గిఫ్ట్ రావడంతో మహేష్ అండ్ ఫ్యామిలీ హ్యాపీగా ఫీలయ్యారట. ‘‘ఈ లాక్‌డౌన్‌లో మాకు అందిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే. కూర్గ్‌లోని అద్భుతమైన వాతావరణం నుంచి.. మంచి ఐటమ్స్ పంపిన రష్మికకు కృతజ్ఞతలు’’ అంటూ గిఫ్ట్ ప్యాక్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు నమ్రత.
https://www.instagram.com/p/CB_FTvgD8Gh/?utm_source=ig_web_copy_link
Read:తన మూడో పెళ్లిపై కామెంట్ చేసిన నటికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన వనిత