Rashmika Mandanna : నా చెల్లికి 13 ఏళ్ళు.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది..

తాజాగా రష్మిక ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది.

Rashmika Mandanna

Rashmika Mandanna : రష్మిక మందన్న వరుస హిట్స్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే కుబేర సినిమాతో హిట్ కొట్టింది. రష్మిక చేతిలో తెలుగు, హిందీ సినిమాలు ఉన్నాయి. వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. తాజాగా రష్మిక ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది.

Also Read : Peddi : ఢిల్లీలో ‘పెద్ది’ ఫైనల్ క్రికెట్ మ్యాచ్.. ప్రస్తుతం షూట్ ఎక్కడ జరుగుతుంది?

మీరు హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు అని ఇంటర్వ్యూలో అడగ్గా రష్మిక సమాధానమిస్తూ..నేను వీకెండ్ హాలిడే కోసం ఏడుస్తాను. నా చెల్లికి 13 ఏళ్ళు. నా కెరీర్ మొదలైనప్పటి నుంచి చెల్లిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. గతంతో పోలిస్తే ఈ విషయంలో ఇప్పుడు చాలా బాధగా ఉంది. నేను అసలు ఏడాదిన్నరగా ఇంటికే వెళ్ళలేదు. నా సొంత ఊరిని, నా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాను. గతంలో నా ఫ్రెండ్స్ ఏదైనా టూర్ కి వెళ్తే నన్ను కూడా జాయిన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు నన్ను అడగడమే మానేశారు. ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే పర్సనల్ లైఫ్ త్యాగం చేయాలి. పర్సనల్ లైఫ్ బాగుండాలంటే కెరీర్లో కొన్ని త్యాగం చేయాలి. నేను ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను అని తెలిపింది.

Also Read : Dhanya Balakrishna : నా బిగ్గెస్ట్ డ్రీమ్.. ఆయనతో ఫోటో దిగాలని 12 ఏళ్లుగా కల.. మాతో మాట్లాడి అడిగి మరీ..

రష్మిక వరుస షూటింగ్స్ వల్లే తన ఇంటికి వెళ్లలేదని తెలుస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ పాపం రష్మిక ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.