Peddi : ఢిల్లీలో ‘పెద్ది’ ఫైనల్ క్రికెట్ మ్యాచ్.. ప్రస్తుతం షూట్ ఎక్కడ జరుగుతుంది?

ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో పెద్ది పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi : ఢిల్లీలో ‘పెద్ది’ ఫైనల్ క్రికెట్ మ్యాచ్.. ప్రస్తుతం షూట్ ఎక్కడ జరుగుతుంది?

Peddi

Updated On : July 7, 2025 / 3:18 PM IST

Peddi : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రా & రస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో పెద్ది పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంవత్సరం మార్చ్ 27 ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం పెద్ది సినిమా మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ అయ్యాక నాసిక్ లో కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తారట. ఇప్పటికే మైసూరులో, రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో షూటింగ్ చేసారు. అయితే పెద్ది సినిమా క్లైమాక్స్ లో క్రికెట్ మ్యాచ్ ఉంటుందట, అందులో చరణ్ ఆడి గెలిపిస్తాడని టాక్.

Also Read : Dhanya Balakrishna : నా బిగ్గెస్ట్ డ్రీమ్.. ఆయనతో ఫోటో దిగాలని 12 ఏళ్లుగా కల.. మాతో మాట్లాడి అడిగి మరీ..

దీంతో పెద్ది సినిమా క్లైమాక్స్ షూట్ ని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆ స్టేడియంతో సినిమా షూట్ కోసం చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్ సమాచారం. దీంతో పెద్ది సినిమాని భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఇటీవల రిలీజయిన గ్లింప్స్ లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ లో అదిరిపోయేలా కొట్టిన షాట్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ది సినిమా క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని తెలుస్తుంది.

Also Read : Venkatesh : చిరుతోనే కాదు.. బాలయ్యతో కూడా వెంకీమామ సినిమా.. ఫ్యాన్స్ కి పండగ..