Rashmika Mandanna : ‘కౌన్ బనేగా కరోర్‌పతి’లో అభిమానికి రష్మిక వీడియో కాల్.. హిందీ షోలో తెలుగులో మాట్లాడి..
తాజాగా ఓ అభిమాని కోసం రష్మిక కౌన్ బనేగా కరోర్‌పతి(Kaun Banega Crorepati) ప్రోగ్రాంకి వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చింది.

Rashmika Mandanna Video Call in Kaun Banega Crorepati Video goes Viral
Rashmika Mandanna : రష్మిక ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యానిమల్(Animal) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి. ఇక రష్మికకు భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ అనే బిరుదు ఆమె అభిమానులు రష్మికకు ఇచ్చారు.
తాజాగా ఓ అభిమాని కోసం రష్మిక కౌన్ బనేగా కరోర్‌పతి(Kaun Banega Crorepati) ప్రోగ్రాంకి వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి సీజన్ 15లో ప్రమోద్ భాస్కర్ అనే కంటెస్టెంట్ వచ్చాడు. ప్రమోద్ భాస్కర్ రష్మికకు పెద్ద అభిమాని. దీంతో అమితాబ్ రష్మికకు వీడియో కాల్ చేయగా ఆమె లిఫ్ట్ చేసి ప్రమోద్ తో, అమితాబ్ తో మాట్లాడింది.
వీడియో కాల్ లో రష్మిక కనబడగానే ప్రమోద్ భాస్కర్ సంతోషం వ్యక్తం చేశాడు. తెలుగులో.. ఎలా ఉన్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అలాగే తన ఫోన్, ల్యాప్ టాప్, వాట్సాప్ అన్నిట్లో మీదే వాల్ పేపర్ ఉంటుందని, మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని ఉందని అన్నాడు. దీంతో రష్మిక అతని అభిమానానికి థ్యాంక్స్ చెప్తూ.. కచ్చితంగా కలుస్తానని, మీరు బాగుండాలని, లైఫ్ లో ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పింది.
Also Read : Nani : నాని సరికొత్త రికార్డ్.. అమెరికాలో మహేష్ తర్వాత నానినే.. స్టార్స్ అంతా నాని వెనకాలే..
ఇక అమితాబ్.. వీడియో కాల్ లోకి వచ్చినందుకు రష్మికకు థ్యాంక్స్ చెప్తూ ఇటీవల యానిమల్ సినిమా చూశానని, ఆ సినిమాలో పర్ఫార్మెన్ చాలా బాగా చేసావని అభినందించారు. దీంతో రష్మిక అమితాబ్ కి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం కౌన్ బనేగా కరోర్‌పతిలో రష్మిక వీడియో కాల్ వైరల్ గా మారింది. కంటెస్టెంట్ ప్రమోద్ భాస్కర్ తన సోషల్ మీడియాలో.. ఈ వీడియో కాల్ అంతా పోస్ట్ చేసి చాలా సంతోషంగా ఉన్నాను అని, ఇలా టీవీలో కనిపిస్తానని, నా ఫేవరేట్ హీరోయిన్ రష్మికతో వీడియో కాల్ మాట్లాడతానని అస్సలు ఊహించలేదు అని పోస్ట్ చేయగా దీనికి రష్మిక రిప్లై ఇస్తూ.. త్వరలో కలుద్దాం. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారింది.
I am so so proud of you. ❤️
Let’s meet soon ok. ?✨— Rashmika Mandanna (@iamRashmika) December 9, 2023