Ravi Teja Mass Jathara Trailer Released
Mass Jathara Trailer: మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ ఈగర గా వెయిట్ చేస్తున్న సినిమా మాస్ జాతర. ఫేం రైటర్ భాను బొగవరపు దర్శకుడిగా మారి చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ జాతర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.. “ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడించింది. ఇక నుంచి సత్తెనాష్” అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయు.
ట్రైలర్ అంతా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో నింపేశాడు దర్శకుడు. ఓపక్క యాక్షన్, మరోపక్క హీరోయిన్ తో రొమాన్స్, రవితేజ మార్క్ కామెడీ పంచులు. ఇవన్నీ కలిపి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందేలా సెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రవి తేజ ఫ్యాన్స్ కైతే పూనకాలు కన్ఫర్మ్ గా అనిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి లేట్ ఎందుకు మా మాస్ జాతర ట్రైలర్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Sreeleela: ఉస్తాద్ మూవీ నెక్స్ట్ లెవల్.. పవన్ కళ్యాణ్ అలా.. హైప్ ఎక్కిస్తున్న శ్రీలీల కామెంట్స్..