Sreeleela: ఉస్తాద్ మూవీ నెక్స్ట్ లెవల్.. పవన్ కళ్యాణ్ అలా.. హైప్ ఎక్కిస్తున్న శ్రీలీల కామెంట్స్..

డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, మాస్ మహారాజ్ రవితేజ జంటగా వస్తున్న మూవీ మాస్ జాతర. (Sreeleela)పేరుకు తగ్గట్టుగానే మాస్ అంశాలు పుష్కలంగా ఉండనున్నాయి ఈ సినిమా.

Sreeleela: ఉస్తాద్ మూవీ నెక్స్ట్ లెవల్.. పవన్ కళ్యాణ్ అలా.. హైప్ ఎక్కిస్తున్న శ్రీలీల కామెంట్స్..

Sreeleela Sensational comments on Pawan kalyan Ustaad bhagat singh

Updated On : October 27, 2025 / 8:39 PM IST

Sreeleela: డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, మాస్ మహారాజ్ రవితేజ జంటగా వస్తున్న మూవీ మాస్ జాతర. పేరుకు తగ్గట్టుగానే (Sreeleela)మాస్ అంశాలు పుష్కలంగా ఉండనున్నాయి ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆ మ్యాటర్ క్లియర్ గా అర్థమయ్యింది. రవి తేజ నుంచి ఎలాంటి అంశాలు ఆడియన్స్ కోరుకుంటారో అలా పక్కాగా ప్రిపేర్ చేసి ఈ సినిమాను దించుతున్నాడు దర్శకుడు భాను భోగవరపు. అందుకే ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. రవి తేజ గత చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Priyanka Jain: శారీలో సీరియల్ బ్యూటీ అందాలు.. ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు

ఇక సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ శ్రీలీల. మాస్ జాతర సినిమా గురించి కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే తాను నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచానాలు కూడా భారీగానే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారా ఉస్తాద్ భగత్ సింగ్ అలా ఉంటుంది. బోలెడంత ఎంటర్ టైన్మెంట్ తోపాటు యాక్షన్ కూడా ఉంటుంది. గతంలో ఎన్నడు చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుంది” అంటూ సినిమాపై భారీ హైప్ ఇచ్చింది శ్రీలీల. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓజీ తరువాత మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు హరిశ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.