JanaSena Party : తెలంగాణపై జనసేనాని దృష్టి.. పార్టీ బలోపేతంకు చర్యలు మొదలు.. కమిటీలన్నీ రద్దు..!

Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీకి ప్రజాదరణ ఉంది. అయితే, పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు ఏపీలో పార్టీ బలోపేతంపైనే దృష్టిసారించారు. ముఖ్యంగా ఏపీ కేంద్రంగానే జనసేన రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. ప్రస్తుతం తెలంగాణపైనా పవన్ కల్యాణ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

JanaSena Party : తెలంగాణపై జనసేనాని దృష్టి.. పార్టీ బలోపేతంకు చర్యలు మొదలు.. కమిటీలన్నీ రద్దు..!

Pawan Kalyan

Updated On : January 6, 2026 / 2:40 PM IST
  • తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి
  • పార్టీ కమిటీలన్నీ రద్దు.. ఆ స్థానంలో అడ్‌హక్ కమిటీల నియామకం
  • క్షేత్ర స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసేలా చర్యలు

JanaSena Party : ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలకంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఏపీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.. మరోవైపు క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంపైనా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్ కేంద్రంగా జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా జనసేనాని పావులు కదుపుతున్నారు.

Alos Read : Tatkal tickets : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ ట్రైన్ టికెట్ ఫాస్ట్‌గా బుక్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీకి ప్రజాదరణ ఉంది. అయితే, పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు ఏపీలో పార్టీ బలోపేతంపైనే దృష్టిసారించారు. ముఖ్యంగా ఏపీ కేంద్రంగానే జనసేన రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. ప్రస్తుతం తెలంగాణపైనా పవన్ కల్యాణ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని చర్యలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీలో వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను రద్దు చేశారు. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటన విడుదల చేశారు. వాటి స్థానంలో తాత్కాలికంగా అడాక్ కమిటీ‌లను నియమించనున్నట్లు తెలిపారు. ఈ అడాక్ కమిటీలు 30 రోజులపాటు పనిచేయనున్నాయి.

ఈ కమిటీ సభ్యులు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, పార్టీని బలోపేతం చేయగల కనీసం ఐదుగురు క్రియాశీల సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురానున్నారు. అడాక్ కమిటీల నివేదికల ఆధా రంగా, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసే విధంగా త్వరలోనే నూతన కమిటీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఈ నిర్ణయాల ద్వారా జనసేన పార్టీని ప్రజల మధ్యకు మరింత దగ్గర చేయడంలో కీలకంగా నిలుస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.