Tatkal tickets : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ ట్రైన్ టికెట్ ఫాస్ట్‌గా బుక్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Tatkal Tickets : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఎందుకంటే.. IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు.

Tatkal tickets : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ ట్రైన్ టికెట్ ఫాస్ట్‌గా బుక్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Tatkal tickets

Updated On : January 6, 2026 / 12:46 PM IST

Tatkal Tickets : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఎందుకంటే.. IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. దీని ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది.

Also Read : Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!.. ఎందుకిలా..? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

సడన్‌గా ప్రయాణం ప్లాన్ చేసినప్పుడు చివరి నిమిషంలో రైలు టికెట్ల కోసం మనం ఆశ్రయించేది తత్కాల్ బుకింగ్. అయితే, బుకింగ్ విండో ఓపెన్ అయ్యే సమయం దగ్గర పడేకొద్దీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అనే కంగారు ఉంటుంది. బుకింగ్ సమయం (ACకి ఉదయం 10:00, నాన్-ఏసీకి 11:00)లో విండో ఓపెన్ అవ్వగానే పేర్లు, వయసు టైప్ చేసేలోపే సీట్లన్నీ మాయమైపోతుంటాయి. తీరా చూస్తే వెయిట్ లిస్ట్ దర్శనమిస్తుంది. అయితే, అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు IRCTC ‘మాస్టర్ లిస్ట్’ అనే స్ట్రాటజీ తెలిస్తే చాలు.

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ఇందుకోసం 10-15 నిమిషాల ముందే మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అయ్యి సిద్ధంగా ఉండాలి. IRCTC ఖాతాలోనే ఇది ఒక సెక్కూర్ ఆప్షన్. ఇందులో మీరు తరచుగా ప్రయాణించే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల పూర్తి వివరాలు (పేరు, వయస్సు, జెండర్, బెర్త్ ప్రిఫరెన్స్) శాశ్వతంగా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీరు తత్కాల్ టికెట్లు బుకింగ్ సమయంలో సమయం వృథా కాకుండా.. ముందుగానే ఎంటర్ చేసుకొని ఉంచుకొనిఉన్న మీకు కావాల్సిన పేర్లపై ఒక్క క్లిక్ తో టికెట్ బుకింగ్ ప్రాసెస్ ను పూర్తి చేయొచ్చు. ప్రతీసారి పేర్లు, ఇతర వివరాలు టైప్ చేయాల్సిన పని ఉండదు. దీని ద్వారా సమయం వృథా కాకుండా తత్కాల్ టికెట్ వేగంగా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Tatkal Tickets

మాస్టర్ లిస్ట్ ఇలా క్రియేట్ చేసుకోండి..
♦ IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List (మాస్టర్ లిస్ట్) ఫీచర్ వాడొచ్చు.
♦ ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వాలి
♦ మై అకౌంట్ లేదా మై ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లాలి
♦ మాస్టర్ లిస్ట్ లేదా యాడ్/మాడీఫై మాస్టర్ లిస్ట్‌’ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి
♦ ప్రయాణికుడి పేరు (ప్రభుత్వ ఐడీలో ఉన్నట్లుగానే), పుట్టిన తేదీ, జెండర్, ఐడీ కార్డు (ఆధార్ వంటివి) ఎంటర్ చేయాలి. అన్ని స్పెలింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్‌గా రాశామా అని చూసుకొని సబ్మిట్ బటన్ పై నొక్కాలి.
♦ మీతోపాటు ప్రయాణించే అందరి వివరాలు ఇలాగే ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
♦ తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ‘మై సేవ్డ్ పాసెంజర్ లిస్ట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. ఆ ప్రయాణానికి ఎవరెవరు వెళ్తున్నారో వారి పేర్లను టిక్ చేయాలి.
♦ ఎంటర్ చేసిన వివరాల్లో తప్పులు లేకుండా అన్నీ కరెక్ట్ గా ఉంటేనే లిస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది.
♦ ఈ విధానం ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో వేగంగా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.