Raviteja – Priyamani : 14 ఏళ్ళ తర్వాత కలిసిన ప్రియమణి, రవితేజ.. ‘ఈగల్ 2’లో ప్రియమణి?

ప్రియమణి ప్రెస్ మీట్, రవితేజ ఈగల్ ఇంటరాక్షన్ ఒకేచోట జరుగుతుండటంతో ప్రియమణి రవితేజ ప్రోగ్రాం మధ్యలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.

Raviteja – Priyamani : 14 ఏళ్ళ తర్వాత కలిసిన ప్రియమణి, రవితేజ.. ‘ఈగల్ 2’లో ప్రియమణి?

Raviteja and Priyamani on single stage adter 14 Years at Eagle Movie Success Promotions

Updated On : February 16, 2024 / 7:52 PM IST

Raviteja – Priyamani : రవితేజ, ప్రియమణి కలిసి 14 ఏళ్ళ క్రితం ‘శంభో శివ శంభో’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ వారిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. బయట కూడా ఎక్కడా కలవలేదు. ఇప్పుడు మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు.

రవితేజ ఇటీవల ఈగల్(Eagle) సినిమాతో వచ్చి సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కొంతమంది స్టూడెంట్స్ తో ఈగల్ టీం ఇంటరాక్షన్ నిర్వహించారు. మరోవైపు ప్రియమణి భామాకలాపం 2(Nhama Kalapam2) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి ప్రెస్ మీట్, రవితేజ ఈగల్ ఇంటరాక్షన్ ఒకేచోట జరుగుతుండటంతో ప్రియమణి రవితేజ ప్రోగ్రాం మధ్యలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.

Also Read : Soul Of Satya : ఏకంగా 8 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా

ప్రియమణి మాట్లాడుతూ.. రవితేజతో శంభోశివశంభో తర్వాత మళ్ళీ కలవలేదు అని, ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాను అని తెలిపింది. అలాగే మీరు యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. నేను ఇప్పుడిప్పుడే భామా కలాపం లాంటి చిన్న యాక్షన్ సినిమాలు చేస్తున్నాను, మన ఇద్దరం కలిసి మళ్ళీ ఒక సినిమా ఎప్పుడు చేద్దాం, యాక్షన్ సినిమా చేద్దాం అని అడిగింది. దీనికి రవితేజ సమాధానమిస్తూ.. డైరెక్టర్ కార్తీక్ పక్కనే ఉన్నాడు. అతను యాక్షన్ బాగా డైరెక్ట్ చేస్తాడు. ఏం జరుగుతుందో చెప్పలేము. కార్తీక్ ప్రియమణిని చూడు ఓకే అంటే ప్లాన్ చెయ్యి అని ఇండైరెక్ట్ గా ఈగల్ 2లో తీసుకుంటారేమో అని హింట్ ఇచ్చాడు. ఈగల్ సినిమాలో క్లైమాక్స్ లో ఈగల్ 2 అనౌన్ చేసిన సంగతి తెలిసిందే.