Ajay Bhupathi : యాటిట్యూడ్ మార్చుకో.. లేదంటే ఇండస్ట్రీలో ఉండవ్..

డైరెక్టర్ అజయ్ భూపతిని రవితేజ ఫ్యాన్స్, నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..

Ajay Bhupathi : యాటిట్యూడ్ మార్చుకో.. లేదంటే ఇండస్ట్రీలో ఉండవ్..

Ajay Bhupathi

Updated On : October 17, 2021 / 8:44 PM IST

Ajay Bhupathi: సెలబ్రిటీలు ఏదైనా ఫంక్షన్‌లో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పోస్ట్ చేసేటప్పుడు కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో అది అనవసరం నెటిజన్లకు. చిన్న సందు దొరికితే చాలు, పాత విషయాలు కూడా బయటకి తీసి మరీ ఆడేసుకుంటూ ఉంటారు.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

దర్శకుడు అజయ్ భూపతికిప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఫస్ట్ సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’ తో క్రేజీ హిట్ కొట్టి ఓవర్‌నైట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండో సినిమా ‘మహా సముద్రం’ అనే టైటిల్‌తో ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ తియ్యబోతుండడంతో వార్తల్లో నిలిచాడు. ఆ కథ రవితేజ, నాగ చైతన్య లాంటి కొందరు హీరోలకు చెప్పాడు కానీ చివరకి శర్వానంద్-సిద్ధార్థ్ చేశారు.

Maha Samudram : రివ్యూ

దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహా సముద్రం’ డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెటిజన్లు కూడా డైరెక్టర్‌ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అజయ్‌కి సన్నిహితంగా ఉండే వాళ్లు ఇకనైనా పద్ధతి మార్చుకో.. లేదంటే సినిమా పరిశ్రమలో నెగ్గుకురాలేవు అంటూ సలహాలిస్తున్నారు.

Nora Fatehi : ‘బాహుబలి’ భామ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతంటే!

రవితేజ తన సినిమాకి నో చెప్పాడని.. చీప్ స్టార్ అంటూ అప్పట్లో ఓ ట్వీట్ వేశాడు అజయ్. అది గుర్తు పెట్టుకుని.. ఇలాంటి ఫ్లాప్ సినిమా చెయ్యనన్నాడని రవితేజ లాంటి స్టార్‌ని పట్టుకుని ఛీప్ స్టార్ అంటావా అంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. యాటిట్యూడ్ మార్చుకో.. ఇలా అయితే ఇండస్ట్రీలో ఉండలేవ్ అంటూ వెల్ విషర్స్ అజయ్ భూపతికి సలహా ఇచ్చారనేది ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’