Raviteja Look From Waltair Veerayyya To Be Out On This Date
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Waltair Veerayya: ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర.. అదిరిపోయిందిగా!
ఇక ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చేందుకు వాల్తేరు వీరయ్య రెడీ అయ్యాడు. మాస్ ఫోర్స్‌ను ఇంట్రొడ్యూస్ చేసేందుకు డేట్ అండ్ టైమ్‌ను ఫిక్స్ చేశాడు. రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 12న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
Waltair Veerayya: వీరయ్య సింగిల్‌గానే వచ్చి వాయిస్తాడా..?
కాగా, ఈ సినిమాలోని బ్యాలెన్స్ రెండు సాంగ్స్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే యూరప్‌కు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ లుక్ ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే.