Raviteja – sreeleela : మరోసారి ధమాకా జంట.. రవితేజ – శ్రీలీల కొత్త సినిమా ఓపెనింగ్..

తాజాగా రవితేజ 75వ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

Raviteja – sreeleela : మరోసారి ధమాకా జంట.. రవితేజ – శ్రీలీల కొత్త సినిమా ఓపెనింగ్..

Raviteja Sreeleela New Movie RT 75 Pooja Ceremony Happened

Updated On : June 11, 2024 / 9:47 AM IST

Raviteja – sreeleela : మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల RT75 సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ 75వ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు రవితేజ. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also Read : Ram Charan : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్.. బాబాయ్ కోసం అబ్బాయి.. మరి ఎన్టీఆర్ కూడా వస్తాడా?

రవితేజ – శ్రీలీల కలిసి నటించిన ధమాకా సినిమా భారీ విజయం సాధించి రవితేజ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. మరోసారి ఈ ఇద్దరూ జంట కడుతుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మిస్టర్ బచ్చన్ షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. ఆ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.

Raviteja Sreeleela New Movie RT 75 Pooja Ceremony Happened

RT75 సినిమాలో రవితేజ పక్కా తెలంగాణ స్లాంగ్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి 2025కి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు. ప్రశాంత్ వర్మ.. ఇలా పలువురు కూడా వాళ్ళ సినిమాలని అనౌన్స్ చేశారు. ఆ బరిలో ఇప్పుడు రవితేజ కూడా చేరాడు. మరి చివరివరకు సంక్రాంతి 2025 బరిలో ఎవరి సినిమాలు ఉంటాయో చూడాలి.