Tiger Nageswara Rao : ఎట్టకేలకు కలెక్షన్స్ గురించి చెప్పిన నిర్మాతలు.. వారం రోజుల్లో టైగర్ నాగేశ్వరరావు..?
టైగర్ నాగేశ్వరరావు నిర్మాతలు ఎట్టకేలకు కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలియజేశారు. మొదటి వారం పూర్తి చేసుకునేపాటికి ఈ మూవీ..

Raviteja Tiger Nageswara Rao first week collections report
Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత వారం అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది.
ఈ మూవీతో విడుదలైన భగవంత్ కేసరి, లియో సినిమాల కలెక్షన్స్ ని ఆడియన్స్ కి తెలియజేస్తూ తమ సినిమాల పై ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. టైగర్ నాగేశ్వరరావు టీం మాత్రం అసలు కలెక్షన్స్ విషయమే తెలియజేయడం లేదు. తాజాగా ఈ నిర్మాతలు ఎట్టకేలకు కలెక్షన్స్ గురించి ట్వీట్ చేశారు. నేటితో మొదటి వారం పూర్తి చేసుకోవడంతో.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతనేవి తెలియజేశారు. మొదటి వారంలో ఈ మూవీ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు మేకర్స్ తెలియజేశారు.
Also read : Sara Ali Khan – Ananya Panday : బాలీవుడ్ ముద్దుగుమ్మల జిమ్ వర్క్ అవుట్ వీడియో చూశారా..?
#TigerNageswaraRao hits the 50+ CRORES mark at the box office ❤️?
Running successfully in its 2nd week with terrific footfalls all over ??
Book your tickets for the ROARING DASARA WINNER now!
– https://t.co/yOg5E0c9LP@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl… pic.twitter.com/uJMOWDFpxM— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 27, 2023
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ కావాలంటే.. సుమారు 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. షేర్ కలెక్షన్స్ 37 కోట్ల వరకు ఉండాలి. మరి టైగర్ నాగేశ్వరరావు ఆ కలెక్షన్స్ ని అందుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తాడా లేదా చూడాలి. కాగా ఈ సినిమాని ఫస్ట్ డే 3 గంటల ఒక నిమిషం నిడివితో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. నిడివి ఎక్కువ అయ్యిందనే కామెంట్స్ రావడంతో.. దాదాపు 24 నిమిషాల సీన్స్ ని కట్ చేసి 2 గంటల 37 నిమిషాల ప్రింట్ ని రిలీజ్ చేశారు. ఈ కొత్త వెర్షన్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది.