స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొ…

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 12:30 PM IST
స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొ…

Updated On : October 12, 2020 / 12:49 PM IST

Raviteja’s Krack Movie: ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాల తర్వాత మాస్‌ మహారాజా రవితేజ, గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్‌’. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈసినిమా లాస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో రీస్టార్ట్‌ అయింది.


కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ‘క్రాక్‌’ యూనిట్‌ షూటింగ్‌ను ఎలా నిర్వహిస్తుందనే విషయాలతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. యూనిట్‌ సభ్యులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం, యూనిట్‌ సభ్యులు మాస్కులు ధరించి శానిటైజర్స్‌ ఉపయోగిస్తూ షూటింగ్‌లో పాల్గొనే సన్నివేశాలన్నీ ఈ మేకింగ్‌ వీడియోలో చూపించారు. అలాగే రవితేజ డైలాగ్ కూడా ఒకటి చూపించారు.


ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్నారు.