Dadasaheb Phalke Film Festival Award : దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌..

రజాకార్ సినిమాకు తన కెమెరా వర్క్ కి గాను ఈ అవార్డు అందుకున్నారు.

Razakar Movie Cinematographer Kushendar Ramesh Reddy gets Dadasaheb Phalke Film Festival Award

Dadasaheb Phalke Film Festival Award : తాజాగా జరిగిన 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి అవార్డు అందుకున్నారు. రజాకార్ సినిమాలోని తన విజువల్స్‌తో అందరినీ మెప్పించాడు ఈ సినిమాటోగ్రఫర్. రజాకార్ సినిమాకు తన కెమెరా వర్క్ కి గాను ఈ అవార్డు అందుకున్నారు.

కుశేందర్ రమేష్ రెడ్డి కేకే సెంథిల్ కుమార్ దగ్గర ఈగ, బాహుబలి 1,బాహుబలి 2, RRR సినిమాలకు చీఫ్ అసోసియేట్‌ గా పని చేస్తూ ఇప్పుడు కెమెరామెన్ గా మారి రజాకార్ సినిమాకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెమెరామెన్‌గా నిలిచారు.

Also Read : Hit 3 Collections : నాని హిట్ 3 మూడు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా? బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తున్న న్యాచురల్ స్టార్..

నిజాం రాజుల నిరంకుశ పాలనను, రజాకర్ల దౌర్జన్యాల్ని మట్టు పెట్టి నిజాం రాజ్యాన్ని భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా కలిపారు అనే వీర గాథల్ని యాట సత్యనారాయణ దర్శకత్వంలో రజాకార్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదే సినిమాకు డైరెక్టర్ కూడా అవార్డు అందుకున్నారు.

ఇక సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ప్రస్తుతం బార్బరిక్, అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Also Read : Nani : అమెరికాలో నాని మరో కొత్త రికార్డ్.. అమెరికా మార్కెట్ అంటే నాని అడ్డా అయిపోయింది.. మహేష్ తర్వాత నానినే..