Re Release of Mayabazar and Premadesam
Mayabazar – Premadesam : ఈ మధ్య కాలంలో ఒక్కప్పటి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి, బెటర్ క్వాలిటీతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు కూడా అనుకున్న రీతిలో అలరించకలేకపోవడంతో, ఫ్యాన్స్ కూడా తమ హీరో హిట్టు మూవీతో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తాజాగా మరో క్లాసిక్ మూవీస్ డిసెంబర్ 9న రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
Poonam Kaur : పూనమ్ కౌర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రెస్ నోట్ రిలీజ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతం, ఒక సంచలనం, ఒక గౌరవం అయిన ‘మాయాబజార్’ ఇప్పుడు మళ్ళీ అలరించనుంది. 1957లో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.
ఎస్ వి రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, సావిత్రి వంటి నటీనటులు నటించిన ఈ మైథలాజికల్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2010లో కలర్ ప్రింట్ తో రీ రిలీజ్ చేసిన ఈ సినిమాను, మళ్ళీ ఇప్పుడు 4K క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అలాగే ప్రేమ సినిమాలో ఒక క్లాసిక్ గా నిలిచిన సినిమా ‘ప్రేమదేశం’. టబు, వినీత్, అబ్బాస్ నటించిన ఈ సినిమా అప్పటి యువతిని ప్రేమదేశంలో విహరించేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘ముస్తఫ్ఫా’, ‘ప్రేమ’ పాటలు.. ఇప్పటికి ఎంతోమంది యూత్ ఫేవరెట్ ప్లే లిస్ట్ లో మోగుతూనే ఉంటాయి. 4K క్వాలిటీతో రిలీజ్ అవుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీని మరోమారు చూసి ఎంజాయ్ చేయండి.
Taking the Re-release madness to a notch higher! #Mayabazar (1957) & #Premadesam (1996) this December 9th! pic.twitter.com/Sw4e93FMvy
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 1, 2022