Poonam Kaur : పూనమ్ కౌర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రెస్ నోట్ రిలీజ్!

ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్ లు అరుదైన వ్యాధికి గురై బాధపడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'మయోసైటిస్‌' అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు టాలీవుడ్ లోని మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా అరుదైన వ్యాధి భారిన పడిందట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు వెల్లువెత్తడంతో.. ఆమె సన్నిహితులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Poonam Kaur : పూనమ్ కౌర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రెస్ నోట్ రిలీజ్!

Poonam Kaur : ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్ లు అరుదైన వ్యాధికి గురై బాధపడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు టాలీవుడ్ లోని మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా అరుదైన వ్యాధి భారిన పడిందట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు వెల్లువెత్తడంతో.. ఆమె సన్నిహితులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Poonam Kaur : నిన్న సమంత, నేడు పూనమ్ కౌర్.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి, జబ్బు లక్షణాలు ఇవే..

గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్.. నవంబర్ 10వ తేదీ నుంచి ‘అఖిల భారత పద్మశాలి సంఘం’తో కలిసి చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే 12వ తేదీ ఢిల్లీ చేరుకున్న పూనమ్ కి వెన్ను నొప్పి రావడంతో, అక్కడి నుంచి బ్యాయలుదేరి ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళింది.

అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ‘ఫైబ్రో మయాల్జియా’ నిర్ధారణ అవ్వడంతో, కేరళలోనే ట్రీట్మెంట్ తీసుకుంది. ‘ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటుందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అంటూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలియజేశాడు. కాగా ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే.. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు.